True love
-
అలాంటి వారి బాధే ఈ సినిమా: మారుతి
మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి కీలక పాత్రల్లో నటిస్తున్న కోలీవుడ్ చిత్రం ‘ట్రూ లవర్’. ఈ చిత్రానికి ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 10న తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుత రోజుల్లో ప్రేమికుల మధ్య మోడరన్ డే రిలేషన్స్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ టాలీవుడ్ హక్కులను బేబీ నిర్మాత ఎస్కేఎన్, డైరెక్టర్ మారుతి దక్కించుకున్నారు. వీరిద్దరు సంయుక్తంగా ట్రూ లవర్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న డైరెక్టర్ మారుతి ఆసక్తికర కామెంట్స్ చేశారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. 'ఈ సినిమాకు ఎందుకు చూడమని చెబుతానంటే. ఒక మగాడి బాధ ఎలా ఉంటుందో చూపించాడు. అమ్మాయి చాలా ఈజీగా తీసుకుంటారు. ఇక్కడ అమ్మాయిల తప్పుకాదు. తన ప్రియురాలిని ఎవరైనా ట్రాప్ చేస్తాడేమో అని ఆమె లవర్ భయపడుతూ ఉంటాడు. అతని బాధను తెరపై చూపించే ప్రయత్నమే ఈ సినిమా. సిన్సియర్‌గా లవ్ చేసే వారి బాధ వర్ణనాతీతం. అలాంటి వ్యక్తి తన ప్రేమ కోసం ఏం చేస్తాడనేదే కథ. ఈ కథను డైరెక్టర్ దాదాపు ఆరేళ్లు కష్టపడి రాశాడు. బేబీ సినిమా చూసేటప్పుడు ప్రతి సీన్ అలానే రాసుకున్నారు. ఇలాంటి కంటెంట్ ఉన్న ఈ సినిమాను ఎవరు మిస్సవరనేది నా నమ్మకం.' అని అన్నారు. కాగా.. మారుతి ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో రాజాసాబ్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. -
ప్రేమిస్తే తర్వాత అలాంటి అనుభూతి కలిగింది
‘‘ప్రేమిస్తే’ అనే డబ్బింగ్ మూవీతో నా కెరీర్ ఆరంభమైంది. ‘ప్రేమిస్తే’ చూసి బాగుందనిపించి రిలీజ్ చేసి, హిట్ సాధించాం. ఇన్నాళ్లకు ‘ట్రూ లవర్’ చిత్రం చూడగానే మళ్లీ అలాంటి అనుభూతి కలిగింది. ఈ సినిమాను ప్రేమలో ఉన్నవాళ్లు, లేనివాళ్లు, ప్రేమలో పడాలనుకుంటున్న వాళ్లు.. ఇలా అందరూ చూడొచ్చు’’ అని డైరెక్టర్ మారుతి అన్నారు. మణికందన్, శ్రీ గౌరీప్రియ, కన్న రవి ప్రధాన పాత్రల్లో ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ట్రూ లవర్’. నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేశన్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్కేఎన్ సమర్పణలో దర్శకుడు మారుతి విడుదల చేస్తున్నారు. సోమవారం ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ప్రభురామ్ వ్యాస్ మాట్లాడుతూ– ‘‘ప్రేమికుల మధ్య ఉంటున్న మోడ్రన్ డే రిలేషన్స్ నేపథ్యంలో ‘ట్రూ లవర్’ ఉంటుంది’’ అన్నారు. ‘‘ఫిబ్రవరి 9న వస్తున్న పెద్ద సినిమాలతో మేము పోటీలో లేము. ‘ట్రూ లవర్’ చిన్న క్యూట్ సినిమా.. మా సినిమాని విడుదల చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని భావిస్తున్నాం’’ అన్నారు ఎస్కేఎన్. ‘‘మా సినిమాలోని భావోద్వేగాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయని ఆశిస్తున్నాం’’ అన్నారు మణికందన్. -
తిండి లేదు.. తిప్పలు పడింది.. విశ్వాసమే మళ్లీ నెగ్గింది!
27 రోజులు.. 64 కిలోమీటర్లు.. దారి తెలీయకున్నా ఎక్కడా ప్రయాణం ఆపలేదు. తిండి లేదు.. తోవలో తిప్పలెన్నో పడింది.. చివరకు కథ సుఖాంతం అయ్యింది. విశ్వాసానికి మారుపేరైన శునకం మరోసారి తన స్వామి భక్తిని చాటుకుని వార్తల్లోకి ఎక్కింది. అదేంటో మీరూ చదివేయండి.. సృష్టిలో ప్రేమ అనంతం. కానీ, ఆ ప్రేమకు స్వచ్ఛతను.. అచ్చమైన అర్థాన్ని చెప్పేవి మాత్రం కొన్నిగాథలే. మూగజీవాలు మనుషుల పట్ల కనబరిచే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా ఇక్కడో శునకం.. యజమాని(కేర్ టేకర్) కోసం చేసిన సాహసం గురించి ముమ్మాటికీ చెప్పుకోవాల్సిందే. పైన ఫొటోలో ఉంది కూపర్. Golden Retriever జాతికి చెందిన శునకం. ఒక నెలకిందట.. ఐర్లాండ్ ఉత్తర భాగంలోని టైరోన్ కౌంటీలోని ఓ ఇంటికి దత్తత వెళ్లింది. కారు నుంచి దిగీదిగగానే పరుగులు అందుకుంది కూపర్. అలా మొదలైన ప్రయాణం 40 మైళ్ల పాటు సాగింది. లండన్డెర్రీలోని టోబర్మోర్లో ఉన్న తన కేర్ టేకర్ చెంతకు చేరింది. కనిపించకుండా పోయిన మూగజీవాల గురించి ఆరా తీసే లాస్ట్‌పాస్ ఎన్ఐ అనే ఛారిటీ కూపర్‌కు చెందిన అందమైన కథను సోషల్ మీడియాలో పంచుకుంది. దాదాపు నెలపాటు సాగిన కూపర్ ప్రయాణం.. ఎక్కడా ఆగలేదు. ఎవరి సాయం లేకుండానే అది ముందుకు సాగింది. దారి తెలియకపోయినా.. అది పాత ఓనర్ చేరుకున్న తీరు ఆశ్చర్యానికి గురి చేయిస్తోందని సదరు ఛారిటీ పేర్కొంది. మరోవైపు అది తిరిగి రావడం చూసి దానిని దత్తత ఇచ్చిన వ్యక్తి భావోద్వేగానికి లోనయ్యారు. ఇకపై కూపర్ ఎక్కడికి వెళ్లదని, తనతోనే ఉంటుందని కన్నీళ్లతో చెబుతున్నారు. -
True Love Story: 65 ఏళ్ల ఎదురుచూపు.. అద్భుత ప్రేమ గాథ!
ప్రేమకు చావు లేదు. అది అజరామరం అంటారు. ప్రేమలో ప్రేమతప్ప ధ్వేషభేషజాలు అస్సలుండవు. దీనిని రుజువుచేసే ఎందరో వీర ప్రేమికులను చరిత్రలో చూశాం కూడా. అవన్నీ పిచ్చి ప్రేమలని కొట్టి పారేయలేం కూడా. ఎందుకంటే ఆయా గాథల్లో రాతిని కూడా చలింపచేయగల శక్తి ఉంటుంది. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ప్రేమికుల ప్రేమ కథ కూడా అటువంటిదే! ఈనాటి ప్రేమ కూడా కాదండోయ్! 1911 నాటి ప్రణయగాథ.. మొదలెడదామా.. పెర్లె స్క్వార్జ్, మాక్స్ వెల్ అనుకోకుండా ఒక కంట్రీ క్లబ్లో కలిశారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారే.. వీళ్లది కూడా అటువంటి ప్రేమే. తొలిచూపులోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. వాళ్లకే తెలీకుండా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఇరు కుటుంబాల్లో విషయం చెప్పారు. ఇరువురి మతాలు వారి పెళ్లికి అడ్డుపడ్డాయి. తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. కుటుంబ పరువు కోసం ఆజన్మాంతం ప్రేమికులుగానే మిగిలిపోయారు. చదవండి: 150 ఏళ్లు పట్టేదట! కానీ.. కేవలం 18 ఏళ్లలోనే.. !! తర్వాత మ్యాక్స్‌వెల్ నావీలో జాయిన్ అయ్యాడు. ఎమ్ఏ, ఎమ్బీఏలు పూర్తి చేసి, కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పీహెచ్డీ సంపాదించాడు. అదే యూనివర్సిటీలో చరిత్ర బోధించాడు. తర్వాత వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో అమెరికన్ వలసరాజ్య చరిత్ర ప్రొఫెసర్‌గా పనిచేశాడు. అనేక పరిశోధన పత్రాలను ప్రచురించాడు. కొన్ని పుస్తకాలు కూడా రాశాడు. 83 సంవత్సరాల వయస్సులో 1979 లో మరణించాడు. పెర్లె మాత్రం చనిపోయేవరకు ప్రియుడికోసం ఎదురుచూస్తూనే ఉంది. పేరెంట్స్ ఆమెను అతని దగ్గరికి పోనివ్వలేదు. 65 యేళ్ల వరకు పెర్లీ నిశ్శబ్ద జీవితాన్ని గడిపింది. మ్యాక్స్ మరణం గురించి విన్న 3 నెలల తర్వాత ఆమె 1980లో కన్నుమూసింది. చదవండి: Unknown Facts About China: చైనా గుట్టు రట్టు చేసే.. 20 షాకింగ్ నిజాలు! ఆనాటి ప్రేమతాలూకు ఆనవాళ్లు తాజాగా ఒక ఇంట్లో ఉత్తరాల రూపంలో బయటపడ్డాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందల కొద్దీ ఉత్తరాలు. పెర్లె నివసించిన ఆ ఇంట్లో అటకపై ఒక పెట్టెలో మాక్స్ అనే వ్యక్తి నుంచి వచ్చిన ప్రేమలేఖలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. చూస్తే అందులోని విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. దాదాపు 1913-1978 వరకు మాక్స్,పెర్లేకి రాసిన ఉత్తరాలవి. అతని లేఖలన్నీ “మై స్వీట్ పెర్ల్” తో ప్రారంభమై.. “ఫరెవర్ యువర్స్.. మాక్స్” తో ముగిశాయి. విధి వాళ్లని కలపనప్పటికీ.. వారు మాత్రం తమ జీవితాంతం ఒకరికొకరు ఉత్తరాలు రాయడం కొనసాగించినట్లు ఆ లేఖలను బట్టి తెలుస్తోంది. ఐతే మాక్స్ నుండి వచ్చిన ఉత్తరాలు మాత్రమే దొరికాయి. పెర్లె రాసిన ఉత్తరాలు దొరకలేదు. ఆఫ్రికా, స్పెయిన్, చిలీ, కెనడా, వాషింగ్టన్, రోడ్ ఐలాండ్, ఫ్రాన్స్‌ల నుండి పెర్లెకి ఉత్తరాలు వచ్చాయి. అతను ఎక్కడికి వెళ్లినా, ఎక్కడున్నా ... ఉత్తరాలు మాత్రం రాస్తూనే ఉండేవాడు. ఇవి ప్రత్యుత్తరాలు అని లేఖల కంటెంట్ తెల్పుతుంది. ఈ విధంగా వాళ్లిరువురు 65 సంవత్సరాలకు పైగా ఉత్తర ప్రత్యుత్తరాలను కొనసాగించినట్లు తెలుస్తోంది. చివరికి మాక్స్ వివాహం చేసుకున్నడని, అతనికి మిచెల్ అనే ఒక కూతురు కూడా ఉన్నట్లు ఆ లేఖలను బట్టి తెలుస్తోంది. ఐతే ఉత్తరాల్లో దాని గురించి ఎక్కువ సమాచారం లేదు. చదవండి: రెస్టారెంట్ విచిత్ర షరతు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు! 1980లో పెర్లే మరణించినప్పుడు ఆమె దాచుకున్న మాక్స్ ఉత్తరాల్లో కొన్ని కాలిపోయాయట. ఆమె కుటుంబం ఆ ఉత్తరాలన్నింటినీ అటకపై ఒక బాక్స్‌లో భద్రపరిచింది. గొప్ప ప్రేమ కథలలో ఒకటి ఉత్తరాల రూపంలో తాజాగా బయటపడింది. ‘ఐ లవ్యూ.. ఇంకేం చెప్పలేను- మాక్స్’ (మతం మారితేనే పెళ్లి చేసుకోవచ్చని పెర్లే చెప్పిన తర్వాత మాక్స్ ఆమెకు రాసిన మొదటి ఉత్తరం ఇది). తదుపరి అక్షరాలు పోస్ట్‌మార్క్ చేసిన ఎన్వలప్లలో ఉన్నాయి. ‘సోమవారం సాయంత్రం నాకు అర్థమైంది. నేను మొదటి నుండి అర్థం చేసుకున్నాను. నువ్వేం అనుకుంటున్నావనేదే అర్థం కావడంలేదు. ఇకపై క్లబ్‌కి రాలేను. నిన్ను ప్రేమిస్తున్నందుకు నాకు అర్థం అయ్యే హింసను నేను అనుభవించలేను. నీ దగ్గర ఉండడం, నిన్ను చూడడం, నువ్వు అని అనిపించడం నేను తట్టుకోలేకపోయాను... (మిగిలిన ఉత్తరం చిరిగిపోయింది) ఇది పెర్లె, మాక్స్‌కు రాసిన ఉత్తరం. ‘మనం కలిసి ఉండలేమని చెప్పిన తర్వాత నాకు వచ్చిన మొదటి లేఖ’ అని కవరుపై రాసివుంది (పెర్లే రాసిన లేఖ గురించి మాక్స్ రాసుకున్న అక్షరాలవి) ఎంత అందమైన ప్రేమ కథ ఇది. చదవండి: Mystery Case: ఐదేళ్ల క్రితం హత్యచేశారు.. కానీ.. -
మీరు నిజంగా ప్రేమిస్తున్నారా?
ప్రతి మనిషి తన జీవితంలో ఒక్కసారైన ప్రేమించటం పరిపాటి. ముఖ్యంగా నేటి తరం యువతీ,యువకులకు ప్రేమించటం ఒక అవసరం లాంటిది. అందుకే ఆ అవసరం తీరిపోగానే ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. కొంతమంది ప్రేమలో విజయం సాధిస్తే.. మరికొందరు విఫలమవుతున్నారు. విఫల ప్రేమికులు కొందరు క్రోదంతో తమను తాము బలిచేసుకోవటమో లేదా ఎదుటి వ్యక్తిని బలితీసుకోవటమో చేస్తున్నారు. ఆకర్షణ, మోహాలను ప్రేమగా పొరపడి తొందపాటుతో నేరాలు చేస్తున్నారు. నిజంగా ప్రేమించటం, ప్రేమించబడటం అన్నది అరుదుగా జరుగుతోంది. నిజమైన ప్రేమ అన్నది ఎదుటి వ్యక్తిని ఎప్పటికీ బాధించదని తెలుసుకోగలగాలి. నిజమైన ప్రేమంటే? అసలు నిజమైన ప్రేమ అంటే భాగస్వామి పట్ల అచంచలమైన, విడదీయలేని అనుబంధం, వాత్సల్యం కలిగి ఉండటమే అని చెప్పొచ్చు. ఇందులో ఎదుటి వారిపట్ల భావోద్వేగాలతో కూడిన శారీరక సంబంధం(శృంగారాన్ని మించినది) కలిగివుంటాము. వారినుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఎదుటివ్యక్తి సంతోషం కోసం పరితపిస్తాము. అతడు/ఆమె లేకుండా జీవితాన్ని ఊహించుకోవటం అసాధ్యం అనిపిస్తుంది. మీరు నిజంగా ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తుంటే.. వన్‌సైడ్ లవ్, టూ సైడ్ లవ్ రెండిటి విషయంలో.. భేషరతుగా ఎదుటివ్యక్తి బాగోగుల గురించి ఆలోచించగలగాలి. కష్టనష్టాల్లో వారికి తోడుగా ఉండగలగాలి. భాగస్వామిని పూర్తిగా అర్థం చేసుకోవాలి, వారితో మంచి,చెడులు, కష్టనష్టాల గురించిన విషయాలు దాపరికాలు లేకుండా పంచుకోగలగాలి. ఆ వ్యక్తి ముందు మనం మనలా ఉండగలగాలి.. నటన అన్నమాట పనికిరాదు. ఆ వ్యక్తిపై గౌరవం ఉండాలి. తన, మన బేధాలు ఉండకూడదు. ఎదుటి వ్యక్తి సంతోషాలకు ప్రాధాన్యత ఇవ్వగలగాలి. నిజమైన ప్రేమలో ‘‘నేను’’ అన్నది కాకుండా ‘‘మేము’’ అన్నది కనిపిస్తుంది. ప్రేమికులు ఇద్దరు ఓ జట్టుగా ఉండటం జరుగుతుంది. -
ట్రూలవ్
‘‘ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్ని’’ అని హాలీవుడ్ అందాల తార జెన్నిఫర్ లోపెజ్ చెబుతున్నారు. బ్యాడ్పార్టనర్స్ వల్లే తన వ్యక్తిగత జీవితంలో ఒడుదొడుకులు ఎదురయ్యాయని జెన్నిఫర్ తన తాజా పుస్తకం ‘ట్రూలవ్’ లో పేర్కొన్నారు.‘‘ ఒక ఇల్లాలిగా, గాళ్ ఫ్రెండ్‌గా నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించా. కానీ బ్యాడ్ పార్టనర్స్ వల్ల నా లైఫ్‌లో చాలా పోగొట్టుకున్నా. శారీరకంగా, మానసికంగా ఎన్నో బాధలు పడ్డా. ఎట్టకేలకు బయటపడ్డాను’’ అని జెన్నిఫర్ చెప్పారు. -
అన్యోన్యంగా.. ఆదర్శంగా..
లక్ష్మీనారాయణౌ గౌరీశంకరౌ భారతీ విధీ ఛాయా సూర్యౌ రోహిణీందూ రక్షేతాం చ వధూవరౌ ఒకప్పటి రోజుల్లో ఈ శ్లోకం పెళ్లికూతురు నుదుట కట్టిన ఫాలపట్టిక (భాషికం)లా- శుభలేఖకి పైభాగంలో కన్పిస్తూ ఉండేది. చాలామంది ఈ శ్లోకాన్నే పెళ్లి శుభలేఖకి పైన ఎందుకుంచేవారు? కారణం - ‘లక్ష్మీనారాయణులూ, పార్వతీ పరమేశ్వరులూ, బ్రహ్మాసరస్వతులూ, ఛాయాదేవీ సూర్యులూ, రోహిణీ చంద్రులూ అనే ఈ ఐదుజంటలూ ప్రస్తుతం వివాహం చేసుకోబోతున్న ఈ జంటను రక్షిస్తూ ఉందురు గాక!’ అని ఈ శ్లోకానికి అర్థం. అదీగాక ఈ ఐదుజంటలూ ప్రేమించుకుని పెళ్లాడిన వాళ్లే. ఇంతకీ ప్రేమపెళ్లెలా ఉంటుంది, ఎలా ఉండాలి? ఈ పురాణ పాత్రల కథలేం చెబుతున్నాయి... - డా.మైలవరపు శ్రీనివాసరావు గెలిచిన ప్రేమ రుక్మిణీ కృష్ణులది ప్రేమవివాహమే. తన శరీరం, కన్నులు, చెవులు, నాలుక, ముక్కు అనే పంచ జ్ఞానేంద్రియాలూ తనవేనంటూ రుక్మిణి కృష్ణునికి తెలియజేసింది. అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుని ద్వారా ఆ వర్తమానాన్ని పంపింది. (‘ప్రాణేశ! నీ మంజుభాషలు వినలేని కర్ణరంధ్రమ్ముల కలిమియేలా..? జన్మమేల ఎన్ని జన్మములకు?...’ అని పోతనామాత్యుడి ‘శ్రీమద్భాగవతం’లో రుక్మిణి అంటుంది). ఆ సందేశంలోని మనఃపూర్వక విధానాన్ని గమనించిన కృష్ణుడు ఆమెను పత్నిగా పరిగ్రహించాడు. భార్యగా కావాలని తీసుకువెళ్లాడు. ఆ కృతజ్ఞతాభావం ఆమెలో ఉంది కాబట్టే శ్రీకృష్ణుడు ఆ తరువాతి కాలంలో ప్రేమపరీక్షా సమయంలో ఒక్క తులసిదళంతో తూగిపోయాడు. ఇక, రాధాకృష్ణులనే ప్రేయసీప్రియుల్లో రాధ అనే ఆమె కృష్ణుని సర్వాంగాలనూ ఆరాధించే ఆరాధన మూర్తి. అయితే, అక్కడ మనమనుకునే తీరుగా ప్రేమ, పెళ్లి, సంతానమనే ధోరణి కలది కాదు. నిజమైన ప్రేమ పరమశివుడు తపస్సు చేసుకుంటుంటే ఆయన వద్ద సేవకురాలిగా చేరింది పార్వతి. ఒకరోజు ఆయన దినచర్యని గమనించింది. అంతే! ఆయన చెప్పనవసరం లేకుండా ఏ సమయానికి ఏది అవసరమో అలా సేవ చేయడం ప్రారంభించింది. అప్పటికి ఇద్దరికీ ఏ విధమైన ఆలోచనా లేనేలేదు. మన్మథుడు ప్రేమబాణం వేయగానే శంకరుడామెని మరోదృష్టితో చూశాడు. కర్తవ్యానికి విఘ్నం కలుగుతోందని గమనించి మన్మథుణ్ణి భస్మం చేశాడు. పార్వతికి ఆ విధానం నచ్చింది. ఒక వ్యక్తి తన కర్తవ్యాన్ని దీక్షతో నెరవేర్చుకుంటూన్న వేళ విఘ్నాన్ని కావాలని కలుగజేసినప్పుడు అతణ్ణి క్షమించడం నేరం కాదనే అభిప్రాయంతో శివుణ్ణే వివాహమాడాలని ప్రేమించ ప్రారంభించింది. తలిదండ్రులు కాదన్నా వినలేదు. తపస్సు ప్రారంభించింది. శంకరుడు మాయారూపంలో బ్రహ్మచారిగా వెళ్లాడు. బూడిద బుస్సన్న- ఇల్లు లేనివాడు- శ్మశాన నివాసి- బిచ్చగాడు- రుద్రాక్షధారి- లయకర్త- వాడితో నీకెందుకన్నాడు పార్వతితో. ‘శంకరుణ్ణి గురించి తెలియక నిందిస్తున్న నీ మాటలను వినడం నేర’మంటూ ఆమె వెళ్లిపోబోయింది. అంతే... శంకరుడామె చేతిని పట్టి వివాహం కావాలన్నాడు. ‘నీ ప్రేమతో దాసుణ్ణి కొనుక్కున్నా’వన్నాడు. అంతేకాదు, తల నుండి కాలి వరకూ తనలో సగభాగాన్ని ఆమెకు బహుమతిగా ఇచ్చేశాడు. తల ఆలోచనకి స్థానమైతే, కాలు ఆచరణకి సంకేతం. కాబట్టి ఆలోచన నుండి ఆచరణ వరకూ ఇద్దరం కలిసే చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఆ ప్రేమజంట. అంటే... పెళ్లి అయ్యాక కూడా పరస్పరం సహకరించుకుంటే అదే నిజమైన ప్రేమ అని ఈ జంట చెబుతోందన్నమాట. విజయ ప్రేమ పాలసముద్రం దగ్గరికొచ్చారు దేవతలూ రాక్షసులూ. సముద్రంలో దాగున్న లక్ష్మీదేవి గమనిస్తోంది. తాము పాముకి తలవైపు పట్టుకుని చిలుకుతామన్నారు రాక్షసులు. సరేనన్నాడు శ్రీహరి. కొంతసేపయ్యాక తోకవైపు పట్టుకుంటామన్నారు- తలవైపు నుండి విషం వస్తుంటే ఆ ఘాటుకి తట్టుకోలేక. దానిక్కూడ సరేనన్నాడు నారాయణుడు. ఇంతలో కవ్వంగా ఉన్న మందర పర్వతం కాస్తా సముద్రంలో దిగబడిపోయింది. తాబేలు రూపాన్నెత్తి పర్వతాన్ని నిలబెట్టి పనిని కొనసాగింపజేశాడు విష్ణువు. ఇలా ప్రతి సందర్భంలోనూ తన కార్యసాధన పద్ధతిని నిరూపించుకుంటూ మొత్తానికి అమృతాన్ని సాధించాడు జనార్దనుడు. శ్రీమన్నారాయణుని కార్యదీక్షాదక్షతకి ఆనందపడి ఆయనతో చూపులు కలిపింది లక్ష్మీదేవి! విష్ణువు కూడా లక్ష్మితో చూపుల్ని కలిపాడు. వారికి వివాహమైంది. ఆమెకి నివాసంగా తన వక్షఃస్థలాన్ని ఇచ్చాడు శ్రీహరి. ఆమె శ్రీహరి హృదయం మీదే నివసిస్తూ- ఆయన ఏ ఆలోచనతో ఉన్నాడో గమనిస్తూ సహకారాన్ని అందించడం ఆరంభించింది. ‘రావణుణ్ణి ఎలా వధించాలా?’ అని విష్ణువు ఆలోచిస్తుంటే వేదవతి రూపంతో వెళ్లి రావణునికి మరణ శాపాన్నిచ్చి వచ్చింది లక్ష్మి. అంటే ... పెళ్లయ్యాక కూడ పరస్పరం సహకరించుకోవడం జరిగితే ఆ ప్రేమపెళ్లి విజయవంతమైనట్లేనని భావమన్నమాట. పెళ్లికి ముందూ, పెళ్లికాలంలో, పెళ్లయ్యాక కూడ ఉండేదే ప్రేమ అని భావం! -
ప్రేమతో... నీ వాలెంటైన్!
స్త్రీ, పురుషుల మధ్య ఏర్పడగలిగే మహోన్నత బంధాన్ని అడ్డుకోవడమా? పెళ్లి మీద నిషేధం విధించడమా? ఒక మనిషి మీద ప్రేమ ఎందుకు పుడుతుందో ఎవరు చెప్పగలరు! కళ్లల్లోంచి హృదయంలోకి జారిపోయే ఆ వెలుగును వర్ణించడం ఎవరితరం? సృష్టిని కొనసాగనిచ్చే ఆ పవిత్ర ప్రేమను ఎంతగానో ప్రేమించాడు సెయింట్ వాలెంటైన్. క్రీ.శ. 270 కాలంనాటి ఈ మతగురువు తమ రోమ్ సామ్రాజ్యం అంతటా ప్రేమతోటలు పెరగాలని కాంక్షించాడు. ప్రేమలో తడిసి ముద్దయ్యేవారిని ముద్దుచేశాడు. అయితే, చక్రవర్తి రెండో క్లాడియస్ తీరు ఇందుకు భిన్నంగా ఉంది. ఒంటరి బ్రహ్మచారులే మంచి సైనికులుగా పోరాడగలరని క్లాడియస్ ఆలోచన. భార్యా, పిల్లాపీచూ అని సైనికులు తలుస్తూంటే కత్తులమీద పట్టు బిగుస్తుందా? అశ్వారూఢులై యుద్ధంలో అరివీర భయంకరులు కాగలరా? అందుకే ఎవరూ వివాహలు చేసుకోకూడదన్నాడు క్లాడియస్. ఏడుస్తున్న పిల్లలను సముదాయించడంలో సహనం కాదు, శత్రువులను తరిమి తరిమి కొట్టడంలో సాహసం చూపమన్నాడు. చక్రవర్తి అజ్ఞానానికి నవ్వుకున్నాడు వాలెంటైన్. అన్యాయం కాదూ! అతర్కం కాదూ! ప్రేమంటే సాక్షాత్తూ దైవమే కాదూ! స్త్రీ, పురుషుల మధ్య ఏర్పడగలిగే మహోన్నత బంధాన్ని అడ్డుకోవడమా? పెళ్లి మీద నిషేధం విధించడమా? పారిపోయి వచ్చిన యువతీయువకులకు పెళ్లిళ్లు జరిపించాడు వాలెంటైన్. ప్రేయసీ ప్రియులను నూతన వధూవరులుగా దీవించి పంపాడు. ప్రేమాగ్నిలో మీ పొరపొచ్చాలను దహించుకోండి; పిల్లాపాపలతో సుఖంగా ఉండండి; ఇంతకంటే అద్భుతమైన కార్యం మరొకటి లేనంతగా ప్రేమలో మునిగిపొండి అన్నాడు. కానీ రహస్యం దాగలేదు. క్లాడియస్‌కు విషయం తెలిసింది. ఉగ్రుడయ్యాడు. రాజద్రోహిని బంధించి తెమ్మని ఆదేశించాడు. భటులు పరుగెత్తారు. వాళ్లను ప్రేమగా ఆహ్వానించాడు వాలెంటైన్. ఒకవైపు రాజ్యం పొరుగుదాడుల్తో సంక్షోభంలో ఉంటే మీరు ప్రేమమంత్రాలు జపిస్తున్నారా? అన్నాడు క్లాడియస్. మనుషుల్ని దగ్గరగా చేసే ప్రేమకు మనుషుల్ని దగ్గర చేస్తున్నాను, అన్నాడు వాలెంటైన్. ప్రేమ మీద అధికారం గెలిచింది. శాసన ధిక్కారం సాకుగా మరణశిక్ష ఖాయమైంది. కారాగారంలో బందీ అయ్యాడు వాలెంటైన్. ఆ ప్రేమగురువును చూసేందుకు ఎవరెవరో వచ్చేవారు. వారిలో జైలు అధికారి కుమార్తె కూడా ఉండేది. వాలెంటైన్‌లోని పూజారిలోంచి ప్రేమికుడు మేల్కొన్నాడు. ఆ చివరి రోజుల్లో ఆమె వచ్చే ఆ క్షణాల్నే ఆయన పొదవుకున్నాడు. వాలెంటైన్‌ను ఫిబ్రవరి 14న ఉరి తీశారు. ఉరితీయబోయే ముందురోజు రాత్రి ‘నీ వాలెంటైన్ నుంచి’ అన్న వాక్యంతో ఆమెకో ఉత్తరం రాశాడు. అదొక చరిత్రాత్మక వాక్యం అయింది. కాలక్రమంలో వాలెంటైన్ అనే పేరు ప్రేమికుడికి పర్యాయపదం అయింది. క్లాడియస్ మరణించాడు. వాలెంటైన్ మరణించీ జీవించాడు. ప్రేమ మీద అధికారం ఎన్నటికీ గెలవలేదు! ఇందులో నిజమెంతో, అబద్ధమెంతో, కాలం తొలగించిన దుస్తులెన్నో, కట్టుకున్న కొత్త రెక్కలెన్నో! వాలెంటైన్ గురించిన ఎన్నో కథనాలు! ఇది ‘ప్రేమ’కు సమీపంగా ఉన్న కథగా ప్రపంచప్రేమికులందరూ గానం చేస్తున్నారు, ప్రేమికుల రోజున ప్రేమకు పునరంకితం అవుతున్నారు. అయితే, వాలెంటైన్ డే అంటే ‘వంద కోట్ల కార్డులు అమ్మడం కాదు. కేవలం కోరుకోవడం కాదు, ఇవ్వడం! ప్రేమంటే కళ్లుమిరుమిట్లుగొలిపే ప్రవాహం కాదు, నిత్యం ప్రవహించాల్సిన జీవధార! పుట్టిన మనిషి చేయగలిగే పుణ్యకార్యం. మరణం దాకా నిలుపుకోగలిగే మహత్వం!