12–12–1950... అభిమానుల కథ!
12–12–1950... ఇప్పుడీ టైటిల్‌తో తమిళంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ టైటిల్ స్పెషాలిటీ ఏంటంటే... సూపర్‌స్టార్ రజనీకాంత్ పుట్టిన తేదీ అది! కథతోనూ రజనీకి లింకుంది. అదేంటంటే... ఐదుగురు రజనీ అభిమానులు ప్రతి రోజునూ తమ అభిమాన హీరో పుట్టిన రోజు కింద ఎలా సెలబ్రేట్ చేశారనేది ఈ చిత్రకథ. తమిళ నటుడు సెల్వ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు ఐదుగురు అభిమానుల్లో ఒకరు ‘కబాలి’ సెల్వగా నటిస్తున్నారు.
సినిమాలో ఆయన లుక్ ‘కబాలి’లో రజనీకాంత్ స్టైల్‌లో ఉంటుందన్న మాట. ఇటీవల రజనీకాంత్‌ను కలసి, సెల్వ కథ వినిపించగా సూపర్‌స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ‘12–12–1950’ను ఏ జానర్‌లో తీస్తున్నారు? అని సెల్వను ప్రశ్నిస్తే... ‘‘సిన్మాలో 72 పర్సెంట్ కామెడీ, 28 పర్సెంట్ జీఎస్టీ ఉంటుంది’’ అన్నారు. ‘జి.ఎస్.టి.’ అంటే ‘గ్యాంగ్‌స్టర్ సెంటిమెంట్ అండ్ థ్రిల్లర్’ అట! ఇందులో ప్రముఖ తమిళ కమెడియన్ తంబి రామయ్య తొమ్మిది డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారని తెలిపారు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చిందట.