రోబోరా.. రోబో! | 2.0: Rajinikanth, Akshay Kumar film’s satellite rights sold for Rs 110 crore | Sakshi
Sakshi News home page

రోబోరా.. రోబో!

Published Tue, Mar 14 2017 12:36 AM | Last Updated on Tue, Sep 5 2017 5:59 AM

రోబోరా.. రోబో!

రోబోరా.. రోబో!

110 కోట్లు... సినిమా రిలీజైన తర్వాత వచ్చే వసూళ్లు కాదు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న ‘2.0’ సినిమా శాటిలైట్‌ హక్కుల రేటు 110 కోట్లు. రజనీ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘రోబో’ సూపర్‌ హిట్టయింది. ‘రోబో’కి సీక్వెల్‌గా వస్తున్న ‘2.0’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దాంతో ఈ సినిమా శాటిలైట్‌ హక్కులకు విపరీతమైన పోటీ నెలకొంది. చివరకు ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్‌ ‘జీ టీవీ’ తెలుగు, తమిళ, హిందీ భాషల శాటిలైట్‌ హక్కులను 110 కోట్లకు సొంతం చేసుకుంది.

 సౌత్‌లో ఈ రేంజ్‌లో అమ్ముడైన ఫస్ట్‌ సినిమా ఇదే. ‘కబాలి’లో రజనీ ‘నిప్పురా..’ అంటారు. అలా ‘రోబోరా.. రోబో’ అనాలేమో. ఓ పాట, కొంత ప్యాచ్‌ వర్క్‌ మినహా షూటింగ్‌ పూర్తయిన ఈ సినిమాలో అమీ జాక్సన్‌ హీరోయిన్‌. హిందీ హీరో అక్షయ్‌కుమార్‌ విలన్‌గా నటిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోన్న ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయాలని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement