చరణ్ కోసం 5 కోట్లతో భారీ సెట్ | 5 crores set for Ram charan Rangasthalam 1985 | Sakshi
Sakshi News home page

చరణ్ కోసం 5 కోట్లతో భారీ సెట్

Published Wed, Jul 19 2017 1:48 PM | Last Updated on Tue, Sep 5 2017 4:24 PM

చరణ్ కోసం 5 కోట్లతో భారీ సెట్

చరణ్ కోసం 5 కోట్లతో భారీ సెట్

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం 1985 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ మాస్ లుక్లో దర్శనమివ్వనున్నాడు. ఇప్పటికే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో గోదావరి నది, పల్లెటూరికి సంబంధించిన కొన్ని సీన్స్ను షూట్ చేశారు. త్వరలో మరో భారీషెడ్యూల్కు రెడీ అవుతున్నారు.

నెక్ట్స్ షెడ్యూల్ కోసం 5 కోట్లతో భారీ సెట్ను రూపొందిస్తున్నారు. 1980ల నాటి వాతావరణం కనిపించేలా ఓ గ్రామాన్ని ఆర్టిఫిషియల్గా నిర్మిస్తున్నారు. దాదాపు 35 రోజులపాటు ఈ సెట్ లోనే షూటింగ్ జరగనుంది. చరణ్తో పాటు సినిమాలో కీలక పాత్రల్లో కనిపిస్తున్న హీరోయిన్ సమంత, ఆది పినిశెట్టి, జగపతిబాబు, అనసూయలో ఈ షూటింగ్లో పాల్గొననున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement