మాస్.. ఊర మాస్.. | Ram Charan leaked look in Rangasthalam 1985 | Sakshi
Sakshi News home page

మాస్.. ఊర మాస్..

Published Thu, Jul 20 2017 11:54 AM | Last Updated on Tue, Sep 5 2017 4:29 PM

మాస్.. ఊర మాస్..

మాస్.. ఊర మాస్..

రామ్ చరణ్ తాజా చిత్రం రంగస్థలం 1985కి సంబంధించిన లుక్స్, మెగా అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. ఇప్పటి వరకు చరణ్ మాస్ హీరోయిజం ఉన్న సినిమాలు చేసినా పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలో మాత్రం నటించలేదు. తొలిసారిగా అలాంటి క్యారెక్టర్ చేస్తుండటంతో రంగస్థలంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సుకుమార్ కూడా తొలిసారిగా తన రెగ్యులర్ ఫార్మాట్ కు భిన్నమైన సినిమా చేస్తుండం ఈ సినిమాపై మరింత ఆసక్తి కలిగిస్తుంది.

1980ల నాటి కథతో తెరకెక్కుతున్న ఈసినిమాలో చరణ్, లుంగీతో పల్లెటూరి యువకుడిలా కనిపించనున్నాడు. చిరు మాస్ ఊరమాస్ క్యారెక్టర్ ను తొలిసారిగా ట్రై చేస్తున్న చరణ్, ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తున్నాడని, అద్భుతంగా నటిస్తున్నాడని దర్శకుడు సుకుమార్ ప్రశంసిచ్చాడు. తాజాగా రంగస్థలం 1985 సినిమాకు సంబంధించిన చరణ్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బనియన్, లుంగీతో ఉన్న చరణ్ పక్క పల్లెటూరి వాడిలా అదరగొడుతున్నాడు. ఇప్పటికే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో హైదరాబాద్ లో మరో భారీ షెడ్యూల్ కు రెడీ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement