
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా షూటింగ్‌జరుపుకుంటున్న ఈ సినిమాను ముందుగా సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించారు. అయితే సంక్రాంతి బరిలో పవన్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా రిలీజ్ అవుతుండటంతో చరణ్ తన సినిమాను వేసవికి వాయిదా వేసుకున్నాడన్న ప్రచారం జరిగింది.
కొద్ది రోజులుగా రంగస్థలం రిలీజ్ డేట్ విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను వేసవికి ముందే రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. సమ్మర్ భారీ చిత్రాలు రిలీజ్ కు రెడీ అవుతుండటంతో కాస్త ముందుగానే సినిమా రిలీజ్ చేస్తే బెటర్ అని భావిస్తున్నారట. అందుకే మార్చి నెలాఖరునే రంగస్థలం 1985 రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
Comments
Please login to add a commentAdd a comment