మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ ధృవ సినిమాతో సూపర్ హిట్ సాధించటంతో రంగస్థలం కు భారీ బిజినెస్ జరుగుతోంది. తాజాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయన్న ప్రచారం జరుగుతోంది.
రామ్‌చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న రంగస్థలం సినిమా శాటిలైట్ రైట్స్ 18 కోటలకు అమ్ముడయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అత్యధిక ధరకు శాటిలైట్స్‌రైట్స్ అమ్ముడయిన మూడో చిత్రంగా రంగస్థలం రికార్డ్ సృష్టించింది. చరణ్‌కంటే ముందు ఎవరికీ అందని రేంజ్‌లో బాహుబలితో ప్రభాస్ నిలవగా తాజాగా త్రివిక్రమ్‌తో చేస్తున్న సినిమాతో పవన్ రెండో స్థానంలో నిలిచాడు. అయితే రంగస్థలం 1985 శాటిలైట్ రైట్స్ కు సంబంధించి చిత్రయూనిట్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు.
Comments
Please login to add a commentAdd a comment