
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై చిరంజీవి తనయుడు, హీరో రామ్‌చరణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలకానుంది. తాజాగా విడుదలైన చిత్ర ట్రైలర్‌కు దేశ వ్యాప్తంగా విశేష స్పందన వస్తోంది. భారీ యాక్షన్ విజువల్స్‌లో రూపొందించిన ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలను భారీగా పెంచేస్తోంది. అభిమానుల నుంచే కాకుండా సినీ తారలు కూడా ‘సైరా’ట్రైలర్‌కు ఫిదా అయ్యారు. (చదవండి: ‘అతనొక యోగి.. అతనొక యోధుడు’)
ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి, హీరోలు నాని, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ, సల్మాన్ ఖాన్‌లు ట్రైలర్‌ను మెచ్చుకున్నారు. తాజాగా బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కూడా ‘సైరా’ కు ఫ్యాన్ అయ్యాడు. ‘సైరా’ ట్రైలర్‌ను చూసిన తర్వాత తన అభిప్రాయాన్ని ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ‘సైరా ట్రైలర్ బాగుంది. ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. నేను చిరంజీవికి పెద్ద అభిమానిని. చిరంజీవి సర్, రామ్ చరణ్ సర్ అండ్ చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్’అంటూ ట్వీట్ చేశాడు. ఇక ట్రైలర్‌లో గంభీరమైన స్వరంతో చిరంజీవి చెప్పిన డైలాగులు మెగా ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నాయి. మెగాస్టార్ సరసన నయనతార నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, మిల్క్ బ్యూటి తమన్నా, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment