‘నా భార్యకు గతంలో పెళ్లైంది’ | Actor vijay take selfie video before suicide | Sakshi
Sakshi News home page

విజయ్‌ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్‌

Published Mon, Dec 11 2017 3:48 PM | Last Updated on Wed, Apr 3 2019 8:57 PM

Actor vijay take selfie video before suicide - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తన చావుకు భార్య వనితతో పాటు నవయుగ ఇన్‌ఫ్రా డైరెక్టర్‌ శశిధర్, అడ్వకేట్‌ శ్రీనివాస్‌ కారణమని సినీ నటుడు విజయ్‌ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అతడు తీసుకున్న సెల్ఫీ వీడియోలో పలు విషయాలు వెల్లడించాడు.

‘వాల్‌ పోస్టర్‌ సినిమా షూటింగ్‌లో వనిత నాకు పరిచయమైంది. పెళ్లైన తర్వాత ఆమె నిజస్వరూపం నాకు తెలిసింది. పారిశ్రామివేత్త సీవీ రావు, శశిధర్‌ వ్యాపార అవకాశాల కోసం వనితను ఉపయోగించుకున్నారు. ఆ విషయం తెలిసినప్పటి నుంచి గొడవలు మొదలయ్యాయి. నా కూతురిని కూడా చూడనివ్వడం లేదు. రూ. 3 కోట్లు ఇవ్వకుంటే నాకు సంబంధించిన వీడియోలు బయటపెడతానని అడ్వకేట్‌ శ్రీను.. నన్ను మానసికంగా హింసించారు. వనితకు గతంలో అమ్మిరెడ్డి అనే వ్యక్తితో పెళ్లైంది. వనిత, ఆమె తల్లి ప్రవర్తన మంచిది కాదని వాళ్ల సొంతూరుకు వెళ్తే తెలిసింది. వనితలాంటి వారిని వదిలిపెట్టొద్దు. డాడీ అందరికీ శిక్ష పడేలా చూడు.. ఐ లవ్‌ యూ డాడీ. నా కూతురు కుందన అలాంటి వాతావరణంలో పెరగటం నాకు ఇష్టం లేదు. మీ దగ్గరకు తీసుకురండి’  అంటూ సెల్ఫీ వీడియోలో విజయ్‌ పేర్కొన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement