
తమిళసినిమా: వరద బాధితుల్లో నటి అనన్య కుటుంబం చిక్కుకుంది. తమిళంలో ఎంగేయుమ్ ఎప్పోదుమ్, సీడన్ చిత్రాల్లో నటించిన నటి అనన్య. మలయాళ కుటుంబానికి చెందిన ఈమె కేరళలోని కొచ్చిలో నివసిస్తోంది. కేరళా రాష్ట్రం 10 రోజులకుపైగా వరదల్లో మునిగిపోయిన విషయం తెలిసిందే. అక్కడి ప్రజలు అష్ట కష్టాల పాలవుతున్నారు. ఎవరైనా కాపాడండి అంటూ చేతులెత్తి మొక్కుతూ అర్థిస్తున్నారు. ఇప్పటికే ఎంతో ప్రాణనష్టం జరిగిపోయింది. అయినా ఇప్పటికీ వరణదేవుడు ఆ రాష్ట ప్రజలను కరుణించలేదు. పేద, ధనవంతులు అన్న తేడా లేకుండా అందరూ వరద బాధితులయ్యారు. ఇటీవల నటుడు జయరామ్ ఇల్లు నీట మునిగిపోవడంతో ఆయన కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి చేర్చారు.
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఇల్లు కూడా నీటిలో మునిగిపోయింది. అదేవిధంగా కొచ్చిలోని నటి అనన్య ఇల్లు నీట మునిగిపోయింది. దీని గురించి ఆమె వాట్సాప్‌లో ఒక ఫొటోను విడుదల చేస్తూ తన ఇల్లు పూర్తిగా వరద నీటితో మునిగిపోయిందని తెలిపింది. కుటుంబ సభ్యులమంతా చాలా భయభ్రాంతులకుగురయ్యామని, గత శుక్రవారం సురక్షితంగా బయటపడ్డామని పేర్కొంది. ప్రస్తుతం పెరంబావేరులోని తన స్నేహితురాలి ఇంట్లో తల దాచుకుంటున్నామని చెప్పింది. తమ లాగే ఏందరో వరదల్లో చిక్కుకుని ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారని, సహాయకులు ముందుకొచ్చి వారందరిని రక్షించాలని పేర్కొంది. అదేవిధంగా మలయాళ సీనియర్ నటుడు సలీమ్‌కుమార్ తన కుటుంబంతో పాటు చుట్టు పక్కల వారు 50 మంది తన ఇంటిపై భాగంలో ఉంటూ సహాయార్థం కోసం ఎదురుచూస్తున్నారు. ఇలా చాలా మంది తమను రక్షించాలంటూ ఫోన్లు, వాట్సాప్‌లు వంటి సామాజిక మాధ్యమాల ద్వారా వేడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment