నటి పూజ రహస్య వివాహం? | Actress Pooja Secretly Married to Sri Lankan Business Man | Sakshi
Sakshi News home page

నటి పూజ రహస్య వివాహం?

Published Mon, Dec 19 2016 5:20 PM | Last Updated on Wed, Apr 3 2019 9:13 PM

నటి పూజ రహస్య వివాహం? - Sakshi

నటి పూజ రహస్య వివాహం?

నటి పూజ వ్యాపారవేత్తను ఆదివారం రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం హల్‌చల్‌ చేస్తోంది. తమిళంలో నాన్‌కడవుల్, జేజే, తంబి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన నటి పూజ. ఈమె తల్లి శ్రీలంకకు, తండ్రి కర్ణాటకకు చెందిన వారన్నది గమనార్హం. బెంగళూర్‌లో చదువుకున్న పూజ తమిళం, తెలుగు, మలయాళం, సింహళ భాషల్లో నటించారు. ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేని పూజ సింహళ భాషలోనే అడపాదడపా నటిస్తున్నారు. ఈమె శ్రీలంకకు చెందిన వ్యాపారవేత్త, మోడల్‌ నటుడు అయిన దీపక్‌ షణ్ముగనాథన్‌ ప్రేమించికుంటున్నట్లు వార్తలు ప్రచారం అయ్యాయి. అంతే కాదు రెండేళ్ల క్రితమే వీరిద్దరికి వివాహ నిశ్చితార్థం జరిగింది.

ఒక దశలో దీపక్, పూజల వివాహం జరిగినట్లు వార్తలు ప్రచారం అయ్యాయి. అనంతరం అవి వదంతులేనని పూజ ఖండించారు. అయితే కొంత కాలం సన్నిహితంగా మెలిగిన వీరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు, దీంతో దీపక్‌తో తనకు సరిపడదని భావించిన పూజా ఆయనకు దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో దీపక్, పూజల మధ్య విభేదాలు తొలగి మళ్లీ దగ్గరయ్యారని, వీరిద్దరూ ఆదివారం శ్రీలంక రాజధాని కొలంబోలో రహస్య వివాహం చేసుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో  ప్రచారం హల్‌చల్‌ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement