బాయ్ ఫ్రెండ్ తో గొడవపడి సినీనటి ఆత్మహత్మాయత్నం!
బాయ్ ఫ్రెండ్ తో గొడవపడి సినీనటి ఆత్మహత్మాయత్నం!
Published Tue, May 27 2014 11:26 AM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM
త్వరలో బాలీవుడ్ కు పరిచయం కానున్న బెంగాలీ నటి స్వస్తికా ముఖర్జీ ఆత్మాహత్యాయత్నం చేశారు. స్వస్తికా ముఖర్జీ ఆత్మహత్యకు కారణం ఓ సినీ దర్శకుడు, బాయ్ ఫ్రెండ్ తో గొడవ పడటమే కారణమని రూమర్లు మీడియాలో వస్తున్నాయి. మణికట్టు కోసుకుని స్వస్తికా ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్టు ఆపోలో వైద్యులు తెలిపారు.
మణికట్టు, మోచేయి వద్ద గాజు ముక్కలు సర్జరీ చేసి తీసివేసామని.. ఇంకా కొన్ని ముక్కలు మణికట్టులో ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. యాక్సిడెంటల్ గా జరిగిందా, లేక ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించిందా అనే విషయాన్ని వైద్యుల చెప్పడానికి నిరాకరించారు.
దివాకర్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సరసన స్వస్తికా ముఖర్జీ నటించేందుకు ఇటీవలే అంగీకరించినట్టు బాలీవుడ్ మీడియా సమాచారం.
Advertisement
Advertisement