వరుణ్ తేజ్, అదితీ రావ్ హైదరీ
వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ స్పేస్ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ వ్యోమగామి (ఆస్ట్రోనాట్)గా కనిపించనున్నారు. వ్యోమగామి అంటే గాల్లో తేలేవారు. అంటే స్పేస్‌లో గ్రావిటీ లేనందున వాళ్లు అలా తిరుగుతుంటారు. అలాంటి వ్యోమగామిని ముంచడానికి ‘చెలియా’ భామ అదితీ రావ్ హైదరీ రెడీ అయింది. కంగారుపడకండి ముంచేయటానికి అంటే పీకల్లోతు ప్రేమలో అండీ.
మరి ఈ వ్యోమగామి ప్రేమగామిగా మారతాడా? తనకు అప్పగించిన మిషన్‌ను ఎలా పూర్తి చేస్తాడు? అనే విషయం తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.ఈ సినిమాలో వరుణ్ పక్కన హీరోయిన్‌గా అదితీ రావ్ హైదరీను సెలెక్ట్ చేసుకున్నారట చిత్రబృందం. ప్రస్తుతం తన పాత్ర కోసం బరువు తగ్గే పనిలో ఉన్న వరుణ్ తేజ్ త్వరలోనే జీరో గ్రావిటీలో ట్రైనింగ్ తీసుకోవటానికి విదేశాలకు పయనం కానున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఉన్నప్పటికీ ఒక్క పాట కూడా ఉండదని సమాచారం. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మించనున్న ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment