లాటిన్ అమెరికాలో 'బాహుబలి' | after america, japan bahubali set to release in latin america | Sakshi
Sakshi News home page

లాటిన్ అమెరికాలో 'బాహుబలి'

Published Tue, Nov 10 2015 10:17 AM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

లాటిన్ అమెరికాలో 'బాహుబలి' - Sakshi

లాటిన్ అమెరికాలో 'బాహుబలి'

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన వెండితెర అద్భుతం బాహుబలి ఇంకా సంచలనాలు నమోదు చేస్తూనే ఉంది. ఇప్పటికే భారతీయ చలనచిత్ర చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని నమోదుచేసింది ఈ భారీ చిత్రం. ఇండియాతో పాటు, అమెరికా, జపాన్ లాంటి చాలా దేశాల్లో భారీ వసూళ్లను కొల్లగొట్టి చరిత్ర సృష్టించిన బాహుబలి తాజాగా లాటిన్ అమెరికాలో విడుదలకు రెడీ అవుతోంది.

తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సన్ డిస్ట్రబ్యూటర్స్, బాహుబలి సినిమాను లాటిన్ అమెరికాలో భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే హక్కులు సొంతం చేసుకున్న ఈ సంస్థ త్వరలోనే లాటిన్ అమెరికాలో వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో సినిమాను విడుల చేసేందుకు రెడీ అవుతోంది. అందుకోసం పెద్ద సంఖ్యలో థియేటర్లను బ్లాక్ చేయడానికి సంప్రదింపులు జరుపుతోంది.

ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్కలు లీడ్ రోల్స్లో నటించిన బాహుబలి ఇప్పటికే 600 కోట్లకు పైగా వసూలు చేసి సౌత్ సినిమా రికార్డులను ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు తీసుకెళ్లింది. ప్రస్తుతం ఈ భారీ చిత్రానికి సీక్వెల్ను రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. మరింత భారీగా రూపొందుతున్న బాహుబలి 2016 చివర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement