దుమ్మురేపుతున్న ధూమ్-3.. 200 దాటి 300 కోట్లకు
బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన ధూమ్-3 సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన ఈ చిత్రం తొమ్మిది రోజుల్లోనే 211 కోట్ల రూపాయల వసూళ్ల రాబట్టింది.
ధూమ్-౩లో అమీర్తో పాటు అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్, ఉదయ్ చోప్రా నటించారు. ఈ చిత్రం ఈ నెల 20న దేశవ్యాప్తంగా 4 వేల థియేటర్లలో విడుదలైంది. హిందీలో మాత్రమే 211 కోట్లు వసూలు చేసింది. ఇతర భాషల్లో మరో 11 కోట్లు రాగా, ఓవర్సీస్ కలెక్షన్లు భారీ మొత్తంలో వచ్చినట్టు సినీ వర్గాలు తెలిపాయి. మొత్తం కలెక్షన్లు కలుపుకొంటే 300 కోట్ల రూపాయలు దాటింది. షారుఖ్ ఖాన్ సినిమా 'చెన్నయ్ ఎక్స్ప్రెస్' కలెక్షన్ల రికార్డును (పది రోజుల్లో 216 కోట్లు) అధిగమిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేగాక, భారత్లో మాత్రమే ధూమ్-3 చిత్రం 300 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని భావిస్తున్నారు.