Dhoom:3
-
అదృష్టవంతురాలిని...
ముంబై: తాను నటించిన సినిమాల్లో అనేకం బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయని, అందువల్ల తానెంతో అదృష్టవంతురాలినని బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ గర్వంగా చెప్పింది. 31 ఏళ్ల కత్రినా నటించిన ‘ధూమ్-3’, ‘ఏక్ థా టైగర్’, జబ్ తక్ హై జాన్’, ‘రాజ్నీతి’ తదితర సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. ‘బాక్సాఫీస్ వద్ద విజయం అనేది నాకొక విషయమే కాదు. ప్రతి ఒక్కరూ తమ సినిమాలు హిట్ కావాలని ఆశిస్తారు. ఎందుచేతనంటే వారు ఆ సినిమా కోసం ఎంతో కష్టపడి ఉంటారు. ఈ రంగంలో ఉన్నవారు దేనినైనా మనస్ఫూర్తిగా స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. అయితే నా అదృష్టం ఏమిటంటే ఇప్పటివరకూ రెండో కోణం ఎదురుకాకపోవడం. నేను నటించిన దాదాపు అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. అందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నా తదుపరి సినిమాకూడా అదే జాబితాలోకి చేరుతుందని ఆశిస్తున్నా. ఎంతో కష్టపడి నటించిన తర్వాత కూడా సినిమా ఆడకపోతే ఎవరికైనా గుండె పిండి అవుతుంది. అది అంత మంచిది కూడా కాదు’ అని అంది. ఇండస్ట్రీలో నంబర్ అనిపించుకునే స్థాయిలో ఉన్న కత్రినా...ప్రేక్షకులు తనను ఇంత బాగా ఆదరిస్తున్నందుకు మురిసిపోతోంది. అయితే ప్రేక్షకులు నటులను ఆదరించాలని, ఆమోదించాలని చెబుతోంది. ‘ప్రేక్షకుల ఆమోదముద్ర అనేది నాకు ఎంతో ముఖ్యం. మన ప్రేక్షకులు నిజాయితీ కలిగినవారు. అవలీలగా క్షమించేస్తారు. వారు ఎంతో మంచివారు కూడా. నటన బాగుంటే ఎవరినైనా అక్కున చేర్చుకుంటారు’అని అంది.కాగా కత్రినా తాజాగా నటించిన ‘బిగ్ బ్యాంగ్’ సినిమా వచ్చే నెల రెండో తేదీన విడుదల కానుంది. -
500 కోట్ల వసూళ్లతో చరిత్ర సృష్టించిన ధూమ్-3
ప్రపంచ వ్యాప్తంగా బాలీవుడ్ చిత్రం ధూమ్-3 కలెక్షన్ల హవా కొనసాగుతోంది. డిసెంబర్ 20 తేదిన విడుదలైన ఈ చిత్రం విశ్వవ్యాప్తంగా 501.35 (83.56 మిలియన్ డాలర్లు) కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది. ధూమ్-3 చిత్రం స్వదేశంలోనే కాకుండా, విదేశాల్లో కూడా వసూళ్ల చరిత్రను సృష్టిస్తోంది అని యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్, కత్రీనా కైఫ్, అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రాలు నటించిన ఈ చిత్రం స్వదేశంలో 351 కోట్ల గ్రాస్ వసూళ్లతో దూసుకుపోతోంది. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో, ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం జర్మనీ, పెరూ, రొమెనియా, జపాన్, రష్యా, టర్కీ దేశాల్లో విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. -
దుమ్మురేపుతున్న ధూమ్-3.. 200 దాటి 300 కోట్లకు
బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన ధూమ్-3 సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన ఈ చిత్రం తొమ్మిది రోజుల్లోనే 211 కోట్ల రూపాయల వసూళ్ల రాబట్టింది. ధూమ్-౩లో అమీర్తో పాటు అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్, ఉదయ్ చోప్రా నటించారు. ఈ చిత్రం ఈ నెల 20న దేశవ్యాప్తంగా 4 వేల థియేటర్లలో విడుదలైంది. హిందీలో మాత్రమే 211 కోట్లు వసూలు చేసింది. ఇతర భాషల్లో మరో 11 కోట్లు రాగా, ఓవర్సీస్ కలెక్షన్లు భారీ మొత్తంలో వచ్చినట్టు సినీ వర్గాలు తెలిపాయి. మొత్తం కలెక్షన్లు కలుపుకొంటే 300 కోట్ల రూపాయలు దాటింది. షారుఖ్ ఖాన్ సినిమా 'చెన్నయ్ ఎక్స్ప్రెస్' కలెక్షన్ల రికార్డును (పది రోజుల్లో 216 కోట్లు) అధిగమిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేగాక, భారత్లో మాత్రమే ధూమ్-3 చిత్రం 300 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని భావిస్తున్నారు.