500 కోట్ల వసూళ్లతో చరిత్ర సృష్టించిన ధూమ్-3
500 కోట్ల వసూళ్లతో చరిత్ర సృష్టించిన ధూమ్-3
Published Mon, Jan 6 2014 9:50 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
ప్రపంచ వ్యాప్తంగా బాలీవుడ్ చిత్రం ధూమ్-3 కలెక్షన్ల హవా కొనసాగుతోంది. డిసెంబర్ 20 తేదిన విడుదలైన ఈ చిత్రం విశ్వవ్యాప్తంగా 501.35 (83.56 మిలియన్ డాలర్లు) కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది. ధూమ్-3 చిత్రం స్వదేశంలోనే కాకుండా, విదేశాల్లో కూడా వసూళ్ల చరిత్రను సృష్టిస్తోంది అని యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్, కత్రీనా కైఫ్, అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రాలు నటించిన ఈ చిత్రం స్వదేశంలో 351 కోట్ల గ్రాస్ వసూళ్లతో దూసుకుపోతోంది. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో, ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం జర్మనీ, పెరూ, రొమెనియా, జపాన్, రష్యా, టర్కీ దేశాల్లో విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది.
Advertisement
Advertisement