కలెక్షన్ల వసూళ్లలో ధూమ్-3 నెం.1 | Aamir Khan’s Dhoom-3 Becomes Number 1 Global Box Office Grosser | Sakshi
Sakshi News home page

కలెక్షన్ల వసూళ్లలో ధూమ్-3 నెం.1

Published Tue, Dec 31 2013 3:32 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

కలెక్షన్ల వసూళ్లలో ధూమ్-3 నెం.1 - Sakshi

కలెక్షన్ల వసూళ్లలో ధూమ్-3 నెం.1

ధూమ్ సిరీస్ లో భాగంగా తాజాగా విడుదలైన ధూమ్-3 కలెక్షన్ల వర్షాన్ని కురిపించడమే కాకుండా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. పది రోజుల క్రితం విడుదలైన ధూమ్-3 చిత్రం షారుక్ ఖాన్ చిత్రం చెన్నై ఎక్స్ ప్రెస్, హృతిక్ రోషన్ నటించిన క్రిష్-3 చిత్రాలు వసూలు చేసిన రికార్డులను అధిగమించింది.  
 
చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రం స్వదేశంలో వసూలు చేసిన 226.70 (షేర్), 302 కోట్ల (గ్రాస్), ప్రపంచవ్యాప్తంగా 422 (గ్రాస్) కోట్ల రూపాయల కలెక్షన్లను ధూమ్-3 అధిగమించింది. స్వదేశంలో ధూమ్-3 చిత్రం 233(షేర్) కోట్లను, ప్రపంచవ్యాప్తంగా 430 కోట్ల (గ్రాస్) రూపాయలను వసూలు చేసింది. 
 
ప్రపంచవ్యాప్తంగా చెన్నై ఎక్స్ ప్రెస్ 422 కోట్లు, 3 ఇడియెట్స్ 395, క్రిష్-3 374, ఏక్తా టైగర్ 319, యే జవానీ హై దివానీ 309, దబాంగ్ 265, జబ్ తక్ హై జాన్ చిత్రం 241 కోట్లు వసూలు చేశాయి. 
 
ఓవర్సీస్ మార్కెట్ లో 20,000,000 డాలర్లు వసూలు చేసిన మూడవ చిత్రంగా, ప్రపంచవ్యాప్తంగా 430 కోట్లు వసూలు చేసిని బాలీవుడ్ చిత్రంగా ధూమ్-3 రికార్డులకెక్కింది. కేవలం పది రోజుల వ్యవధిలోనే కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న రానున్న సెలవుల్లో ధూమ్-3 మరిన్ని కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement