వివాదాస్పద హీరోతో మణిరత్నం
మల్టీస్టారర్‌గా తెరకెక్కనున్న మణిరత్నం ప్రాజెక్టులో వివాదాస్పద హీరో శింబు కూడా నటించనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో నలుగురు హీరోలు ఉంటారని వార్తలు కూడా వచ్చాయి. ఆ పాత్రల కోసం విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్‌లను మణిరత్నం సంప్రదించినట్లు తెలుస్తోంది. మణిరత్నం సినిమాలో తన పాత్ర గురించి ఇంతకు ముందే జ్యోతిక మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే.
అలాగే నానితో పాటు ఐశ్వర్య రాజేశ్ పాత్రలు కూడా అధికారికంగా ఓకే అయ్యాయి. విజయ్ సేతుపతికి కాల్షీట్లు ఖాళీగా లేకపోవడంతో ఈ ప్రాజెక్టుకు అంగీకరించే అవకాశం లేనట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో నటీనటుల గురించి వెల్లడించడానికి చిత్రయూనిట్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. సంతోష్ శివన్ దీనికి ఛాయాగ్రాహకుడిగా, ఏఆర్ రెహ్మన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.