
సూర్య
ఆకాశంలో విహరించాలనుకునే 100 మంది పిల్లల కలను నెరవేర్చబోతున్నారు ‘సూరరై పోట్రు’ చిత్రబృందం. సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’. తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా!’ టైటిల్‌తో విడుదల కానుంది. మోహన్‌బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. పైలెట్ నుంచి ఎయిర్‌లైన్స్ కంపెనీకి అధినేతగా ఎదిగిన ఓ వ్యక్తి జీవిత కథగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా వంద మంది పిల్లలతో కలసి చిత్రబృందం ఆకాశంలో విహరించబోతోందట. ఈ పిల్లలందరూ తొలిసారి ఫ్లయిట్‌లో ప్రయాణించనున్నారు. ఆకాశం సాక్షిగా ఈ పిల్లల సమక్షంలో ఈ ప్రయాణంలోనే ఈ సినిమాలోని తొలి పాటను విడుదల చేయాలనుకుంటున్నారు. ‘మీరు కంటున్న కల ఏంటి?’ అనే విషయం మీద అద్భుతమైన వ్యాసం రాసిన 100 మంది పిల్లలను ఈ ట్రిప్ కోసం ఎంపిక చేశారట చిత్రబృందం.
Comments
Please login to add a commentAdd a comment