హీరో ట్వీట్కు స్పందించిన కేంద్ర మంత్రి | Akshay Kumar requests Sushma Swaraj for speedy Sudan evacuation Indians stuck | Sakshi
Sakshi News home page

హీరో ట్వీట్కు స్పందించిన కేంద్ర మంత్రి

Published Tue, Jul 12 2016 8:18 PM | Last Updated on Mon, Sep 4 2017 4:42 AM

హీరో ట్వీట్కు స్పందించిన కేంద్ర మంత్రి

హీరో ట్వీట్కు స్పందించిన కేంద్ర మంత్రి

ముంబై: దక్షిణ సూడాన్లో చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు చర్యలను వేగవంతం చేయాలంటూ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ను కోరాడు. భద్రత బలగాలకు, ప్రభ్యుత్వ వ్యతిరేక వర్గాలకు మధ్య జరుగుతున్న పోరులో జూబా నగరం అల్లకల్లోలంగా మారింది. ఈ నేపథ్యంలో అక్కడున్న భారతీయులను సురక్షితంగా తరలించాలని అక్షయ్ కుమార్ చేసిన ట్వీట్కు సుష్మా స్వరాజ్ స్పందించారు.

'అక్షయ్ కుమార్ గారు ఆందోళన చెందకండి. జూబా నుంచి భారతీయులను సురక్షితంగా తరలిస్తున్నాం' అని సుష్మా ట్విట్టర్లో సమాధానమిచ్చారు. సుడాన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశం తరలించేందుకు విదేశాంగ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement