Indians evacuation
-
సూడాన్ టూ భారత్.. ఆనందంలో బాధితులు..
న్యూఢిల్లీ: సూడాన్ నుంచి భారతీయుల్ని స్వదేశానికి రప్పించే ‘ఆపరేషన్ కావేరి’ వేగవంతంగా సాగుతోంది. ఈ క్రమంలో భారతీయులు స్వదేశం చేరుకున్నారు. కేంద్రం భారత వాయుసేన, నావికా దళాల ద్వారా భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేరుస్తున్నది. కాగా, ఆపరేషన్ కావేరిలో భాగంగా సూడాన్ నుంచి దాదాపు ఆరువేల మంది భారతీయులు స్వదేశం చేరుకున్నట్టు తెలుస్తోంది. ముందుగా భారతీయులను సూడాన్‌లోని సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడి నుంచి భారత్‌కు చేరుస్తున్నది. ఇప్పటికే పలువురు స్వదేశానికి వచ్చేయగా తాజాగా మరో 231 మంది వాయు మార్గంలో ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో భారత్ చేరుకున్న వారి సంఖ్య 6వేలకు చేరుకుంది. ఇదిలా ఉండగా.. గురువారం రాత్రి వందకు పైగా మందిని తరలించే క్రమంలో తెగువ ప్రదర్శించారు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్లు. జెడ్డాకు చేరుకునే క్రమంలో పోర్ట్ ఆఫ్ సూడాన్‌కు 121 మందితో కూడిన భారతీయ పౌరుల బృందం చేరుకోవాల్సి ఉంది. అయితే.. చేరుకునే మార్గం లేక వాడి సయ్యద్నా చిక్కుకుపోయారు. ఈ సమాచారం అందుకున్న ఏఐఎఫ్ రంగంలోకి దిగింది. వాళ్లను తరలించేందుకు C-130J హెర్క్యులస్‌తో బయల్దేరింది. అయితే.. వాడి సయ్యద్నాలో ఉన్న చిన్న ఎయిర్‌స్ట్రిప్‌లో ల్యాండింగ్‌కు అనుకూలంగా లేని పరిస్థితి. దీంతో.. పైలట్లు సమయస్ఫూర్తి ప్రదర్శించారు. నైట్ విజన్ గాగుల్స్ సాయంతో ఏమాత్రం తప్పిదం లేకుండా ఎయిర్‌ఫోర్స్ పైలెట్లు ఎయిర్‌క్రాఫ్ట్‌ను చాకచక్యంగా ల్యాండ్ చేశారు. #WATCH | Another flight carrying 231 Indian passengers reaches New Delhi. They have been evacuated from conflict-torn Sudan.#OperationKaveri pic.twitter.com/oESNze3YPd — ANI (@ANI) April 29, 2023 ఇది కూడా చదవండి: సరిహద్దులో సాధారణ స్థిరత్వం: చైనా విదేశాంగ మంత్రి -
మరో 489 మంది సొంతగడ్డకు..
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ నుంచి భారతీయులను ఎయిర్ ఇండియా విమానాల్లో స్వదేశానికి చేరవేసే కార్యక్రమం సోమవారం మూడో రోజుకు చేరుకుంది. ‘ఆపరేషన్ గంగ’లో భాగంగా రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి 249తో ఒక విమానం, హంగేరి రాజధాని బుడాపెస్ట్ నుంచి 240 మందితో మరో విమానం సోమవారం ఢిల్లీకి చేరుకున్నట్లు అధికారులు చెప్పారు. ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి భారతీయుల చేరవేత ప్రక్రియ శనివారం ప్రారంభమయ్యింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 6 ఎయిర్ ఇండియా విమానాల్లో 1,396 మందిని వెనక్కి తీసుకొచ్చింది. ప్రైవేట్ సంస్థలు స్పైస్‌జెట్, ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సైతం ‘ఆపరేషన్ గంగ’లో భాగంగా తమ విమానాలను బుకారెస్ట్, బుడాపెస్ట్‌కు పంపించాయి. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకురావడానికి మరికొన్ని విమానాలను పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాయి. పశ్చిమ ప్రాంతాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచన ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో వారాంతపు కర్ఫ్యూను ప్రభుత్వం ఎత్తివేసినట్లు భారత రాయబార కార్యాలయం సోమవారం తెలియజేసింది. సాధ్యమైనంత త్వరగా రైళ్ల ద్వారా ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతాలకు చేరుకోవాలని భారత విద్యార్థులకు సూచించింది. విదేశీయులు, శరణార్థుల కోసం ఉక్రెయిన్ రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు ఇండియన్ ఎంబసీ పేర్కొంది. రైల్వే స్టేషన్లు రద్దీగా మారే అవకాశం ఉందని, అయినప్పటికీ విద్యార్థులు సహనం వహించాలని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. రైళ్లు రద్దు కావడం లేదా ఆలస్యం కావడం వంటివి జరగొచ్చని, అన్నింటికీ సిద్ధంగా ఉండాలని వెల్లడించింది. పాస్‌పోర్టు, తగినంత నగదు, ఆహారం, వేడినిచ్చే దుస్తులు ఎల్లప్పుడూ కలిగి ఉండాలని సూచించింది. -
ముంబై విమానాశ్రయంలో ఉద్విగ్న వాతావరణం (ఫోటోలు)
-
ఉక్రెయిన్: ముంబై ఎయిర్‌పోర్టులో ఉద్విగ్న క్షణాలు
ముంబై: రష్యా సైనిక దాడులతో ఉక్రెయిన్ దేశంలో భయం గుప్పిట్లో గడిపిన భారతీయ విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో రుమేనియా నుంచి బయల్దేరిన ఎయిరిండియా తొలి విమానం ముంబై చేరుకుంది. ఈ విమానంలో 219 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. శనివారం బుకారెస్ట్ నుంచి బయల్దేరిన ఎయిరిండియా తొలి విమానంలో ఇండియాకు వచ్చిన విద్యార్థులకు కేంద్ర మంత్రులు ఎస్.జయశంకర్, పీయూష్ గోయల్ ముంబై ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. విద్యార్థులను స్వస్థలాకు తరలించేందుకు అధికారులు ముమ్మర ఏర్పట్లు చేస్తున్నారు. 219 భారతీయుల్లో ఐదుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ఉన్నారు. తెలుగు విద్యార్థులు.. పోతుల వెంకట లక్ష్మీధర్‌రెడ్డి, తెన్నేటీ వెంకట సుమ, అర్ఫాన్ అహ్మద్, అమ్రితాంష్, శ్వేతశ్రీలు తొలి విమానంలో భారత్‌కు సురక్షితంగా చేరుకున్నారు. #WATCH | Union Minister Piyush Goyal welcomes the Indian nationals safely evacuated from Ukraine at Mumbai airport pic.twitter.com/JGKReJE1ct — ANI (@ANI) February 26, 2022 Union Minister Piyush Goyal welcomes Indian students evacuated from Ukraine at Mumbai Airport pic.twitter.com/eqUfOuViyw — ANI (@ANI) February 26, 2022 -
ఉక్రెయిన్: ఒకేసారి 219 మంది భారతీయుల తరలింపు
Indians Evacuation: ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం బాంబుల వర్షం మూడో రోజు కూడా కొనసాగుతోంది. రాజధాని నగరం కీవ్‌పై బాంబలు మిస్సైల్స్‌తో రష్యన్ దళాలు విరుచుకుపడుతున్నాయి. దీంతో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రమాదక ప్రదేశాల్లో ఉన్నవారంతా బాంబ్ షెల్టర్స్, అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లు, బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ పౌరులు, విద్యార్థులు తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. రుమేనియా నుంచి తొలి ఎయిర్ ఇండియా విమానం బయల్దేరింది. విమానంలో మొత్తం 219 మంది భారతీయులు ఉన్నారు. ఈ రోజు( శనివారం) రాత్రి 8.45 గంటలకు ఎయిర్ ఇండియా విమానం ముంబైకి చేరుకోనుంది. రేపు( ఆదివారం) అర్ధరాత్రి 2.30 గంటలకు రెండో విమానం ఢిల్లీ చేరుకోనుంది. ఉక్రెయిన్ నుంచి భారతీయ పౌరుల తరలింపు ప్రారంభమైందని భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ ట్విటర్లో పేర్కొన్నారు. తరలింపు బృందాలు 24 గంటలూ క్షేత్రస్థాయిలో పని చేస్తున్నాయని చెప్పారు. తాను స్వయంగా తరలింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నానని వెల్లడించారు. మొత్తం 219 మంది భారతీయ పౌరులతో ముంబైకి మొదటి విమానం రుమేనియా నుంచి బయలుదేరిందని తెలిపారు. Regarding evacuation of Indian nationals from Ukraine, we are making progress. Our teams are working on the ground round the clock. I am personally monitoring. The first flight to Mumbai with 219 Indian nationals has taken off from Romania. pic.twitter.com/8BSwefW0Q1 — Dr. S. Jaishankar (@DrSJaishankar) February 26, 2022 #WATCH | "...Entire GoI is working day & night to evacuate everyone and our mission is not complete till we have evacuated the last person. Remember this day 26th Feb in your life...," Rahul Shrivastava, Indian Ambassador in Romania to the evacuated Indians from #Ukraine pic.twitter.com/Ro4pBGrB76 — ANI (@ANI) February 26, 2022 -
హీరో ట్వీట్‌కు స్పందించిన కేంద్ర మంత్రి
ముంబై: దక్షిణ సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు చర్యలను వేగవంతం చేయాలంటూ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కోరాడు. భద్రత బలగాలకు, ప్రభ్యుత్వ వ్యతిరేక వర్గాలకు మధ్య జరుగుతున్న పోరులో జూబా నగరం అల్లకల్లోలంగా మారింది. ఈ నేపథ్యంలో అక్కడున్న భారతీయులను సురక్షితంగా తరలించాలని అక్షయ్ కుమార్ చేసిన ట్వీట్‌కు సుష్మా స్వరాజ్ స్పందించారు. 'అక్షయ్ కుమార్ గారు ఆందోళన చెందకండి. జూబా నుంచి భారతీయులను సురక్షితంగా తరలిస్తున్నాం' అని సుష్మా ట్విట్టర్లో సమాధానమిచ్చారు. సుడాన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశం తరలించేందుకు విదేశాంగ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.