Russia Ukraine War: Air India Flight Carrying Indians From Ukraine, Details Inside - Sakshi
Sakshi News home page

Ukraine Crisis: ఒకేసారి 219 మంది భారతీయుల తరలింపు

Published Sat, Feb 26 2022 3:42 PM | Last Updated on Sat, Feb 26 2022 6:51 PM

Ukraine War: Air India Flight Carrying Indians Evacuated From Ukraine - Sakshi

Indians Evacuation: ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం బాంబుల వర్షం మూడో రోజు కూడా కొనసాగుతోంది. రాజధాని నగరం కీవ్‌పై బాంబలు మిస్సైల్స్‌తో రష్యన్‌ దళాలు విరుచుకుపడుతున్నాయి. దీంతో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రమాదక ప్రదేశాల్లో ఉన్నవారంతా బాంబ్‌ షెల్టర్స్‌, అండర్‌ గ్రౌండ్‌ మెట్రో స్టేషన్లు, బంకర్‌లలో తలదాచుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో భారతీయ పౌరులు, విద్యార్థులు తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. రుమేనియా నుంచి తొలి ఎయిర్‌ ఇండియా విమానం బయల్దేరింది. విమానంలో మొత్తం 219 మంది భారతీయులు ఉన్నారు. ఈ రోజు( శనివారం) రాత్రి 8.45 గంటలకు ఎయిర్‌ ఇండియా విమానం ముంబైకి చేరుకోనుంది. రేపు( ఆదివారం) అర్ధరాత్రి 2.30 గంటలకు రెండో విమానం ఢిల్లీ చేరుకోనుంది. 

ఉక్రెయిన్ నుంచి భారతీయ పౌరుల తరలింపు ప్రారంభమైందని భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జయశంకర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. తరలింపు బృందాలు 24 గంటలూ క్షేత్రస్థాయిలో పని చేస్తున్నాయని చెప్పారు. తాను స్వయంగా తరలింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నానని వెల్లడించారు. మొత్తం 219 మంది భారతీయ పౌరులతో ముంబైకి మొదటి విమానం రుమేనియా నుంచి బయలుదేరిందని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement