
భయపెడుతూ..నవ్విస్తూ...
హారర్ చిత్రాలకు ఓ ప్రత్యేకత ఉంది. ఎంత భయపెట్టినా, ఇంకా భయపడాలని కోరుకుంటారు ప్రేక్షకులు. మరో చిత్రం ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధమైంది. మనోజ్ నందం, మాదాల రవి ముఖ్యతారలుగా శ్రీ హయగ్రీవ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డా. జేఆర్ రావు నిర్మించిన చిత్రం ‘అలౌకిక’. భానుకిరణ్ చల్లా దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. మంచి హారర్, థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను భయపెడుతూనే నవ్విస్తుందని దర్శక నిర్మాతలు తెలిపారు.