షూటింగ్ లో గాయపడ్డ హీరోయిన్!
ముంబై: బాలీవుడ్ యువ హీరోయిన్ అలియా భట్ గాయపడ్డారు. అలియా కుడి భుజానికి గాయమైంది. అలియా ప్రస్తుతం తమిళనాడులో 'కపూర్ అండ్ సన్స్' సినిమా షూటింగ్లో పాల్గొంటోంది. షూటింగ్ సందర్భంగా ఆమె గాయపడినట్టు సమాచారం.
భుజం నొప్పి ప్రాథమిక దశలో ఉందని, ఎలాంటి ఒత్తిడి లేదని అలియా చెప్పారు. రెండో వారాల్లో కోలుకుంటానని అలియా ట్వీట్ చేశారు. శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా గాయం కారణంగా ఆదివారం యోగా డేను జరుపుకోలేకపో్యానని ట్వీట్ చేశారు.