రాజీ చిత్రంలో ఆలియా భట్
అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న ‘రాజీ’ సినిమా ట్రైలర్ మంగళవారం ఉదయం విడుదలయ్యింది. 1.5 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ కథలోని కీలక విషయాలను చెప్పకనే చెప్తుంది. ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం హరిందర్ సిక్కా పుస్తకం ‘కాలింగ్ శెహమత్’ ఆధారంగా 1971 నాటి ఇండో - పాక్ యుద్ధ పరిస్థితుల నేపధ్యంలో రూపొందింది. దేశం కోసం పాకిస్థాన్ ఆర్మీ అధికారిని పెళ్లి చేసుకున్న కాశ్మీరి యువతి అత్తవారింటికి వెళ్లిన తర్వాత గూఢచారిగా ఎలా మారిందనే కథాంశంత ఈ చిత్రం తెరకెక్కింది.
ట్రైలర్‌లో ఆలియా భట్‌ను తొలుత అయాయకమైన కాశ్మీరి యువతిగా, అనంతరం గూఢచారిగా మారి తుపాకీ పట్టి, పోరాటాలు చేసే మహిళగా రెండు కోణాలలో చూస్తాం. ట్రైలర్‌ను బట్టే ఈ చిత్రంలో ఆలియా నటన అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. ట్రైలర్‌తో చిత్రం పై అంచనాలు మరింత పెరిగాయి. ధర్మ మూవీస్, జంగిల్ పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నన ఈ చిత్రానికి మేఘన గుల్జార్ దర్శకత్వం వహిస్తున్నారు. మేఘన గుల్జార్ ‘తల్వార్’ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అలియాతో పాటు విక్కి కౌశల్, రజిత్ కపూర్, జైదీప్ అహ్లవత్, సోని రాజ్డాన్ ఇతర పాత్రలు పోషస్తున్నారు. మే 11న ఈ చిత్రం విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment