అల్లరోడికి ప్రమోషన్ వచ్చింది | allari Naresh Blessed With a Baby Girl | Sakshi
Sakshi News home page

అల్లరి నరేష్కి ప్రమోషన్ వచ్చింది

Published Wed, Sep 28 2016 3:14 PM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM

అల్లరోడికి ప్రమోషన్ వచ్చింది

అల్లరోడికి ప్రమోషన్ వచ్చింది

యంగ్ హీరో అల్లరి నరేష్ కు ప్రమోషన్ వచ్చింది. ఇప్పటి వరకు వెండితెర మీద అల్లరి హీరోగా ఉన్న నరేష్ ఇంట మరింత నవ్వులు కనిపించనున్నాయి. గత ఏడాది మేలో విరుపతో నరేష్ వివాహం ఘనంగా జరిగింది. కాగా బుధవారం నరేష్ దంపతులకు ఆడపిల్ల పుట్టింది.

తను తండ్రి అయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న నరేష్, అందమైన కూతురు జన్మించటం తన అదృష్టం అంటూ ట్వీట్ చేశాడు. మరో యంగ్ హీరో నాని, హీరోయిన్ ప్రియమణి... నరేష్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు.


'టీచర్ : నువ్వు బాగా అల్లరి చేస్తున్నావ్, వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్?
స్టూడెంట్ : అల్లరి నరేష్
ఇట్స్ ఏ బేబీ గర్ల్
కంగ్రాట్స్ బాబాయ్' అంటూ నరేష్ పాపను ఎత్తుకున్న ఫోటో తో సహా ట్వీట్ చేశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement