virupa
-
Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్ భార్యను చూశారా? (ఫోటోలు)
-
నా భార్య నా బీభత్సాన్ని ఇంట్లో చాలా సార్లు చూసింది
-
అల్లరి నవ్వులు
ఫొటో చుశారుగా? నువ్వుల పువ్వులు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. తన ముద్దుల తనయ ఇవికా హాయిగా నవ్వుతుంటే, అల్లరి నరేశ్ ఆ చిన్నారిని చూసి తనను తానే మరిచిపోయేంతలా నవ్వుతున్నారు. ‘‘ఇవికాకు 15 నెలలే. నన్ను గెలుచుకుందన్న విషయం తనకు ఆల్రెడీ తెలుసు’’ అని హీరో ‘అల్లరి’నరేశ్ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. నరేశ్ 2015లో చెన్నై అమ్మాయి విరూపను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. -
‘అల్లరి’ నరేశ్‌కు ప్రమోషన్
వెండితెరపై తన అల్లరితో థియేటర్లో ప్రేక్షకులకు నవ్వులు పంచుతున్న ‘అల్లరి’ నరేశ్ ఇల్లంతా చిన్నారి నవ్వులతో సందడిగా మారింది. నిజ జీవితంలో నరేశ్‌కి తండ్రిగా ప్రమోషన్ లభించింది. నరేశ్ భార్య విరూపా కంఠమనేని బుధవారం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ‘‘చాలా సంతోషంగా ఉంది. అందమైన చిన్నారి పాపకు తండ్రి అయిన అదృష్టవంతుడిని’’ అంటూ ‘అల్లరి’ నరేశ్ తన ఆనందాన్ని పంచుకున్నారు. చిట్టి చిన్నారితో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గత ఏడాది మే నెలలో నరేశ్, విరూపల వివాహం జరిగింది. -
అల్లరోడికి ప్రమోషన్ వచ్చింది
యంగ్ హీరో అల్లరి నరేష్ కు ప్రమోషన్ వచ్చింది. ఇప్పటి వరకు వెండితెర మీద అల్లరి హీరోగా ఉన్న నరేష్ ఇంట మరింత నవ్వులు కనిపించనున్నాయి. గత ఏడాది మేలో విరుపతో నరేష్ వివాహం ఘనంగా జరిగింది. కాగా బుధవారం నరేష్ దంపతులకు ఆడపిల్ల పుట్టింది. తను తండ్రి అయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న నరేష్, అందమైన కూతురు జన్మించటం తన అదృష్టం అంటూ ట్వీట్ చేశాడు. మరో యంగ్ హీరో నాని, హీరోయిన్ ప్రియమణి... నరేష్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు. 'టీచర్ : నువ్వు బాగా అల్లరి చేస్తున్నావ్, వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్? స్టూడెంట్ : అల్లరి నరేష్ ఇట్స్ ఏ బేబీ గర్ల్ కంగ్రాట్స్ బాబాయ్' అంటూ నరేష్ పాపను ఎత్తుకున్న ఫోటో తో సహా ట్వీట్ చేశాడు. Teacher:Nuvvu Baga Allari chesthunnavu. What's ur fathers Name ? Student:Allari Naresh It's a Baby Girlllll Congrats Babai @allarinaresh pic.twitter.com/EtAWeqHOgJ — Nani (@NameisNani) 28 September 2016 @allarinaresh ..hey congrats — priyamani (@priyamani6) 28 September 2016 -
వైభవంగా అల్లరి నరేష్ పెళ్లి
-
ఆ హీరో బ్యాచిలర్ లైఫ్‌కు శుభం కార్డు
హైదరాబాద్ : అల్లరిని తన ఇంటి పేరుగా మార్చుకున్న హీరో నరేష్ తన బ్యాచిలర్ లైఫ్‌కు శుభం కార్డు వేయబోతున్నాడు. శుక్రవారం ( మే 29) రాత్రి 9 గంటల 3 నిమిషాలకు నరేష్.. విరూప మెడలో మూడుముళ్లు వేయబోతున్నాడు. హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వివాహాం జరుగబోతోంది. మరోవైపు అల్లరి నరేష్ నివాసం.. పెళ్లి సందడి తో కళకళలాడుతోంది. కుటుంబ సభ్యులు నిన్న అతడిని పెళ్లికొడుకును చేశారు. కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. మరోవైపు ఓ ఇంటివాడు కాబోతున్న నరేష్ ఇటీవల తన స్నేహితులకు బ్యాచిలర్ పార్టీ కూడా ఇచ్చాడు. ఈ సందర్భంగా స్నేహితులు... మరో వికెట్ డౌన్ అంటూ అతడిని ఆట పట్టించారు. నరేష్ స్నేహితులు నాని, నిఖిల్, తరుణ్, ఖయ్యుం, శశాంక్ తదితరులు టీజ్ చేస్తూ ఫోటో దిగారు.