
ఫొటో చుశారుగా? నువ్వుల పువ్వులు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. తన ముద్దుల తనయ ఇవికా హాయిగా నవ్వుతుంటే, అల్లరి నరేశ్ ఆ చిన్నారిని చూసి తనను తానే మరిచిపోయేంతలా నవ్వుతున్నారు. ‘‘ఇవికాకు 15 నెలలే. నన్ను గెలుచుకుందన్న విషయం తనకు ఆల్రెడీ తెలుసు’’ అని హీరో ‘అల్లరి’నరేశ్ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. నరేశ్ 2015లో చెన్నై అమ్మాయి విరూపను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.