అల్లరి నరేష్ ముద్దుల పాప పేరేంటో తెలుసా?
హైదరాబాద్: ప్రముఖ హస్య నటుడు, టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ తమ జీవితంలోకి అడుగుపెట్టిన పాపను అపురూపంగా చూసుకుంటున్నారు. ఈ మేరకు తన బంగారం అదేనండీ.. తన ముద్దుల పాపతో ఉన్న ఫోటోనొకదాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. గతంలో తనకు కూతురు పుట్టిన ఆనంద క్షణాలను ఫేస్ బుక్ ద్వారా అభిమానులతో పంచుకున్న ఈ కరెంట్ తీగ తాజాగా ట్విట్టర్ అందుకున్నారు. ‘సెల్ఫీరాజా’ విజయంతో ఖుషీగా ఉన్న నరేష్ తన గారాల పట్టి పేరును వెల్లడిస్తూ ట్వీట్ చేశారు. అయానా ఇవిక ఈదర, అవర్ లైఫ్.... అంటూ నరేష్ ట్వీట్ చేసారు. దీంతో టాలీవుడ్ ప్రముఖులు, ఇతర అభిమానులు, స్నేహితుల సందేశాలు వెల్లువెత్తాయి.
కాగా గతేడాది మేలో పెళ్లి చేసుకున్న అల్లరి నరేశ్-విరూపదంపతులకు ఈ సెప్టెంబర్ లో పాప పుట్టింది. ఈ విషయాన్ని ఫేస్ బుక్ ద్వారా షేర్ చేశారు. పాపను ఎత్తుకొన్న ఫొటోను నరేశ్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Presenting Ayana Evika Edara, our life :) pic.twitter.com/8AbbP2iNld
— Allari Naresh (@allarinaresh) December 4, 2016
Ayana Evika,d name is as cute as d princess herself! The happiness in @allarinaresh & @v1rupa eyes says it all