బన్నీ సినిమాలో ధోని హీరోయిన్..? | allu arjun Next movith kiara adavani | Sakshi
Sakshi News home page

బన్నీ సినిమాలో ధోని హీరోయిన్..?

Published Sun, Mar 5 2017 9:40 AM | Last Updated on Tue, Sep 5 2017 5:17 AM

బన్నీ సినిమాలో ధోని హీరోయిన్..?

బన్నీ సినిమాలో ధోని హీరోయిన్..?

ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమా చేస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను లైన్లో పెడుతున్నాడు. స్టార్ రైటర్గా పేరుతెచ్చుకున్న వక్కంతం వంశీ తొలి సారిగా డైరెక్ట్ చేయబోయే సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను నాగబాబు సమర్పణలో లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అదే సమయంలో నటీనటుల ఎంపిక కూడా జరుగుతోందట. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో చిత్రయూనిట్ ఇప్పటికే ఓ నిర్ణయానికి కూడా వచ్చేశారన్న టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్లో ఘనవిజయం సాధించిన ధోని సినిమాతో పరిచయం అయిన కైరా అద్వానీని హీరోయిన్గా తీసుకోవాలని భావిస్తున్నారట. అయితే ప్రస్తుతం బాలీవుడ్ ఆఫర్లతో బిజీగా ఉన్న కైరా డేట్స్ అడ్జస్ట్ కానీ పక్షంలో లోఫర్ బ్యూటి దిశాపటానికి ఫైనల్ చేయాలని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement