బన్ని-సుకుమార్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? | Allu Arjun Sukumar Movie Tile Viral In Social Media | Sakshi
Sakshi News home page

బన్ని-సుకుమార్‌ సినిమా టైటిల్‌ ఇదేనా?

Published Sat, Jan 18 2020 5:12 PM | Last Updated on Sat, Jan 18 2020 5:28 PM

Allu Arjun Sukumar Movie Tile Viral In Social Media - Sakshi

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా క్రియేటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్వకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకోగా రెండో షెడ్యూల్‌ పి​బ్రవరిలో ప్రారంభం కానుంది. అంతేకాకుండా రెగ్యులర్‌గా జరిగే ఈ షెడ్యూల్‌లోనే బన్ని పాల్గొననున్నాడు. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని సమాచారం. అయితే ఈ సినిమా టైటిల్‌పై సుకుమార్‌తో సహా చిత్ర యూనిట్‌ తెగ తర్జనభర్జన పడుతోందట. అయితే ఈ కథ ప్రధానంగా శేషాచలం అడువుల చుట్టూ సాగుతుండటంతో ‘శేషాచలం’అనే టైటిల్‌ సరిగ్గా ఆప్ట్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ భావిస్తోందట. ఇక తన సినిమా టైటిల్‌ విషయంలో క్రియేటివిటీని ఉపయోగించే సుకుమార్‌ ఈ టైటిల్‌కు ఓకే చెప్పాడా? అల్లు అర్జున్‌ ‘శేషాచలం’కు పచ్చజెండా ఊపాడా అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.

‘శేషాచలం’ తో పాటు మరో మూడు టైటిళ్లను కూడా చిత్రయూనిట్‌ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంకు సంబంధించిన మరో హాట్‌ టాపిక్‌ నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా మెప్పించిన అనసూయకు బన్ని సినిమాలోనూ అవకాశం ఇవ్వాలని సుకుమార్‌ భావించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాలో అనసూయ కోసం స్పెషల్‌గా ఓ క్యారెక్టర్‌ను డిజైన్‌ చేసినట్లు లీకువీరుల సమాచారం. కాగా తివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అల.. వైకుంఠపురములో’ తో  హ్యాట్రిక్‌ కొట్టిన అల్లు అర్జున్‌.. ఈ చిత్రంతో సుకుమార్‌తోనూ హ్యాట్రిక్‌ కొట్టాలని బన్ని ఆరాటపడుతున్నారు. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి నెగటీవ్‌ రోల్‌ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. దేవిశ్రీప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు.

చదవండి: 
‘అల.. వైకుంఠపురములో’ మూవీ రివ్యూ
‘అల’ నుంచి ‘సిత్తరాల సిరిపడు’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement