
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ భాషలకు సంబంధించిన ప్రముఖ నటులు నటిస్తున్న ఈ సినిమాకు మరో టాప్ స్టార్ యాడ్ అయ్యాడు.
ఈ సినిమాలో పలు కీలక సన్నివేశాలకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వాయిస్ అందించనున్నాడట. ఈ వార్తలపై అధికారిక ప్రకటన లేకపోయినా బన్నీ వాయిస్ ఇస్తున్నాడన్న టాక్ ఫిలిం సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది. చిరుకు జోడిగా నయనతార నటిస్తున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో కనిపిస్తున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతమందిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment