
తేజ్
తేజ్, వర్షిణి జంటగా తోట నాగేశ్వరరావు స్వీయదర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘తథాస్తు’. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ‘‘లవ్, యాక్షన్ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. సెంట్రల్ జైలు నుంచి విడుదలైన హీరో.. హీరోయిన్‌ని కలిసే సీన్లు, ఓ భారీ ఫైట్ సీన్ తెరకెక్కిస్తున్నాం’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాకు సాకేత్ నాయుడు స్వరకర్త.