ఆమిర్.. 25 వారాల్లో 25 కేజీలు..! | Amir Khan to loose 25 kgs in 25 weeks | Sakshi
Sakshi News home page

ఆమిర్.. 25 వారాల్లో 25 కేజీలు..!

Published Sat, Jan 16 2016 8:51 AM | Last Updated on Sun, Sep 3 2017 3:45 PM

ఆమిర్.. 25 వారాల్లో 25 కేజీలు..!

ఆమిర్.. 25 వారాల్లో 25 కేజీలు..!

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, ప్రస్తుతం తను చేస్తున్న సినిమా కోసం భారీ రిస్క్ చేస్తున్నాడు. మల్లయోధుడు మహావీర్ ఫొగట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న దంగల్ సినిమాలో నటిస్తున్న ఆమిర్, ఆ పాత్ర కోసం భారీగా బరువు పెరిగాడు. ముఖ్యంగా కీలక సన్నివేశాల్లో 55 ఏళ్ల వయసులో ఇద్దరు అమ్మాయిల తండ్రిగా కనిపించనున్న ఆమిర్ ఖాన్. అందుకు తగ్గ ఆహార్యం కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకొని బరువు పెరిగాడు. ఆ భాగం షూటింగ్ పూర్తవ్వటంతో ఆమిర్ ఇప్పుడు బరువు తగ్గే పనిలో ఉన్నాడు.

నెక్ట్స్ షెడ్యూల్లో తన వయసుకన్నా మరింత యంగ్గా కనిపించటం కోసం ఏకంగా 25 కేజీల బరువు తగ్గటానికి కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే డైట్ మార్చేసి సన్నబడే పనిలో ఉన్న ఆమిర్, ప్రముఖ డైటీషియన్ డాక్టర్ వినోద్ దురందర్ పర్యవేక్షణలో 25 వారాల్లోనే 25 కేజీల బరువు తగ్గాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇంత వేగంగా బరువు పెరగటం, తగ్గటం ఆరోగ్యానికి అంత మంచిది కాదని డాక్టర్లు చెపుతున్నా, క్యారెక్టర్ కోసం ఆమిర్ రిస్క్ చేయడానికే రెడీ అయ్యాడు.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న దంగల్ సినిమాకు నితీష్ తివారీ దర్శకుడు. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్, డిస్నీ వరల్డ్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సాక్షి తన్వార్ హీరోయిన్గా నటిస్తోంది. క్రిస్టమన్ కానుకగా 2016 డిసెంబర్ 23న దంగల్ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement