Mahavir phogat
-
‘వినేశ్ ఫోగట్.. తన మొదటి కోచ్‌కే కృతజ్ఞత తెలపలేదు’
స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్‌పై మాజీ రెజ్లర్ బబితా ఫోగట్ విమర్శలు గుప్పించారు. వినేశ్ ఫోగట్ రెజ్లింగ్ కెరీర్ కాపాడుకోవడానికి తన తండ్రి మహవీర్ ఫోగట్ ఎంతో పోరాటం చేశారని అన్నారామె. కానీ ఈ విషయంలో ఆయనకు వినేశ్ ఫోగట్ కృతజ్ఞతలు తెలపలేదని ఆరోపించారు. బబితా ఫోగట్ ఓ ఇంటర్వ్యులో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘ప్యారిస్ ఒలింపిక్స్‌లో వినేశ్.. 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురైంది. అనంతరం వినేశ్ తన కోచ్‌లు, ఫిజియోలు, ఇతర సహాయక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కానీ ఆమె మొదటి కోచ్ అయిన మహావీర్ ఫోగట్ కృతజ్ఞతలు తెలపలేదు. నేను ఇప్పటివరకు మా నాన్న ఏడ్చిన సందర్భాలను కేవలం మూడు చూశాను. మా అక్కలు వివాహం చేసుకున్న సమయంలో, మా పెద్దనాన్న మరణించిన సమయంలో, ప్యారిస్ ఒలింపిక్స్‌లో వినేశ్ ఫోగట్ అనర్హత గురైన సమయంలో ఆయన ఏడ్చారు. మా పెద్దనాన్న మరణించిన సమయంలో వినేశ్ రెజ్లింగ్ మానేస్తే.. ఇంటివెళ్లి మరీ రెజ్లింగ్ ప్రాక్టిస్ చేయాలని ప్రోత్సహించారు. అంతలా మా నాన్న వినేశ్ కోసం కష్టపడ్డారు. కానీ ఆమె తన మొదటి గురువును వదిలేసి.. మిగతావారికి కృతజ్ఞతలు తెలిపారు’’ అని అన్నారు.ఇక.. ఇటీవల వినేశ్ ఫోగట్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆమె హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అక్టోబర్ 5న హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. -
Vinesh vs Babita?: రాజకీయాల్లోకి వినేశ్?.. అక్కతో పోటీకి సై!
భారత స్టార్ రెజ్లర్, ఒలింపియన్ వినేశ్ ఫొగట్ రాజకీయాల్లో అడుగుపెట్టనుందా?.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయనుందా?.. అక్కపై పోటీకి సిద్దమవుతోందా? అంటే అవుననే అంటున్నాయి వినేశ్ సన్నిహిత వర్గాలు. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో మహిళల 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో ఫైనల్ చేరి.. వినేశ్ ఫొగట్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.పతకం చేజారిందిఇంతరకు భారత మహిళా రెజ్లర్లలో ఎవరికీ సాధ్యం కాని విధంగా స్వర్ణ పతక బౌట్‌కు అర్హత సాధించింది వినేశ్ ఫొగట్. అయితే, నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువ బరువు ఉన్న కారణంగా ఫైనల్లో పాల్గొనకుండా ఆమెపై వేటు పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనకు కనీసం సంయుక్త రజతం ఇవ్వాలని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌కు అప్పీలు చేయగా.. నిరాశే ఎదురైంది.ఈ పరిణామాల నేపథ్యంలో వినేశ్ ఫొగట్‌కు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆమెకు మద్దతుగా పెద్ద సంఖ్యలో నెటిజన్లు సోషల్ మీడియాను హోరెత్తించారు. ఇక వినేశ్ ప్యారిస్ నుంచి తిరిగి రాగానే.. దేశ రాజధాని ఢిల్లీలో ఆమెకు అపూర్వ స్వాగతం లభించిన విషయం తెలిసిందే. ఇందిరా గాంధీ విమానాశ్రయంలో వినేశ్ అడుగుపెట్టగానే.. కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా ఆమె మెడలో మాల వేసి సత్కరించారు. ఆయన కుటుంబ సభ్యులు సైతం వినేశ్‌కు సాదరస్వాగతం పలికారు.అక్కపై పోటీకి సై?ఈ నేపథ్యంలో వినేశ్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతోందనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, తాను మాత్రం క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టబోవడం లేదని ఆమె స్పష్టతనిచ్చింది. అయితే, జాతీయ మీడియా తాజా కథనాల ప్రకారం.. వినేశ్ ఫొగట్ పొలిటికిల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.ఈ విషయం గురించి వినేశ్ కుటుంబ సన్నిహిత వర్గాలు మాట్లాడుతూ.. ‘‘అవును... అయినా వినేశ్ ఎన్నికల్లో ఎందుకు పోటీచేయకూడదు?.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేశ్ ఫొగట్ వర్సెస్ బబితా ఫొగట్, బజరంగ్ పునియా వర్సెస్ యోగేశ్వర్ దత్.. చూసే అవకాశం లేకపోలేదు. వినేశ్‌ను రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు రాజకీయ పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, ఆమె ఏ పార్టీలో చేరబోతోందో చెప్పలేం’’ అని పేర్కొన్నాయి. బావ మద్దతు వినేశ్‌కే?కాగా బబితా ఫొగట్ మరెవరో కాదు.. వినేశ్ పెదనాన్న, చిన్ననాటి కోచ్ మహవీర్ ఫొగట్ కూతురు. ఆమె బీజేపీ తరఫున ఈ ఏడాది అసెంబ్లీ బరిలో దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. బజరంగ్ పునియా కూడా మహవీర్ అల్లుడే. రెజ్లర్ సంగీత ఫొగట్ భర్త.. అతడు కూడా రెజ్లరే. భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వినేశ్‌కు మద్దతుదారుడు.చదవండి: Court of Arbitration for Sport: ఒక్క గ్రాము ఎక్కువున్నా అనర్హతే -
వినేశ్ విషయంలో అసలేం జరిగింది?.. బ్రిజ్‌భూషణ్ కుమారుడి రియాక్షన్
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో పసిడి పతకం ఖాయమని మురిసిపోయిన భారతీయల హృదయాలు ముక్కలయ్యాయి. మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై పెట్టుకున్న ఆశలు నీరుగారిపోయాయి. మన అమ్మాయి ‘బంగారం’తో తిరిగి వస్తుందనుకుంటే కన్నీళ్లే మిగిలాయి.ఆటలోనే కాదు.. సహచరులకు న్యాయం చేయాలనే పట్టుదలతో ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొన్న ఈ హర్యానా రెజ్లర్ అనూహ్య రీతిలో పతక రేసు నుంచి నిష్క్రమించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వినేశ్ విజయాలను ఓర్వలేక కుట్ర జరిగిందని అభిప్రాయపడుతున్నారు. ఫైనల్ వరకు సజావుగా సాగిన ఆమె ప్రయాణం ఇలా పతకం లేకుండా ముగిసిపోవడం పట్ల భావోద్వేగానికి గురవుతున్నారు.మీరేమీ నిరాశ చెందవద్దుకేవలం వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉంటే.. వేటు వేస్తారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వినేశ్ అంకుల్, ‘దంగల్’ మహవీర్ ఫొగట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నేనేమీ మాట్లాడలేకపోతున్నాను. ఆమె స్వర్ణంతో తిరిగి వస్తుందని దేశమంతా ఆశిస్తోంది.అయితే, కేవలం 50- 100 గ్రాముల ఎక్కువ బరువు ఉన్నా కొన్నిసార్లు బౌట్‌కు అనుమతిస్తారు. దేశ ప్రజలారా.. మీరేమీ నిరాశ చెందవద్దు. ఏదో ఒకరోజు వినేశ్ కచ్చితంగా దేశానికి పతకం తెస్తుంది. వచ్చే ఒలింపిక్స్ కోసం నేను ఆమెను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తాను’’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.కాగా హర్యానాకు చెందిన మహవీర్ ఫొగట్ మల్లయోధుడు. తన కూతుర్లను రెజ్లర్లుగా తీర్చిదిద్దిన కోచ్. మహవీర్ సోదరుడి కుమార్తే వినేశ్. ఆమె కూడా మహవీర్ శిక్షణలో రాటుదేలింది. కాగా మహవీర్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో దంగల్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ మహవీర్ పాత్రను పోషించాడు.బ్రిజ్‌భూషణ్ సింగ్ కుమారుడి స్పందనఇక రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు, ఒకప్పటి బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ కొంతమంది మహిళా రెజ్లర్లు ఆరోపించిన విషయం తెలిసిందే. వారికి మద్దతుగా వినేశ్ ఫొగట్ ఢిల్లీలో పోరాటానికి దిగారు. బజ్రంగ్ పునియా, సాక్షి మాలిక్ తదితరులతో కలిసి ఉద్యమం ఉధృతం చేశారు. ఈ క్రమంలో అరెస్టయ్యారు కూడా! అయితే, బ్రిజ్‌భూషణ్‌పై తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో అతడు పదవి నుంచి తప్పుకొన్నాడు. బీజేపీ సైతం అతడికి టికెట్ ఇవ్వలేదు. అయితే, అతడి కుమారుడిని అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకుంది.ఇక వినేశ్ ఫొగట్‌పై వేటు నేపథ్యంలో బ్రిజ్‌భూషణ్ సింగ్ కుమారుడు, బీజేపీ ఎంపీ కరణ్ భూషణ్ సింగ్ స్పందించాడు. ‘‘దేశం మొత్తానికి తీరని లోటు. ఈ విషయాన్ని రెజ్లింగ్ ఫెడరేషన్ లోతుగా పరిశీలించి.. అవసరమైన చర్యలు తీసుకుంటుంది’’ అని పేర్కొన్నారు. మరోవైపు.. ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ మాత్రం వినేశ్ విషయంలో కుట్ర జరిగిందని.. ఆమెకు కావాల్సినంత సమయం ఇవ్వలేదని ఆరోపించాడు. ఆప్ సైతం భారత్ ఒలింపిక్స్‌ను బాయ్‌కాట్ చేయాలంటూ డిమాండ్ చేసింది.నిబంధనలు ఇలా..ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ పోటీల్లో భాగంగా.. ఆయా విభాగాల్లో పోటీపడుతున్న ప్లేయర్ల బరువును.. ఏ రోజైతే బౌట్ ఉంటుందో ఆరోజు ఉదయం తూస్తారు. ప్రతి వెయిట్ క్లాస్‌లో పోటీపడే అథ్లెట్లకు తగినంత సమయం ఉంటుంది. రెండు రోజుల వ్యవధిలో తొలి రోజు బరువు కొలిచేందుకు 30 నిమిషాల సమయం ఇస్తారు. ఈ వ్యవధిలో ఎన్నిసార్లైనా బరువు కొలుచుకోవచ్చు. అయితే, రెండోరోజు మాత్రం ఇందుకు 15 నిమిషాల సమయమే ఉంటుంది. ఈలోపు నిర్ణీత బరువు ఉంటేనే బౌట్‌కు అనుమతిస్తారు.కాగా బరువు తూచే సమయంలో కేవలం స్లీవ్‌లెస్ గార్మెంట్ తప్ప ఇతర దుస్తులేవీ ధరించకూడదు. గోళ్లు పూర్తిగా కత్తిరించుకోవాల్సి ఉంటుంది. ఇక బౌట్‌కు ముందు రెజ్లర్లకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.చదవండి: Vinesh Phogat: ఆస్పత్రి పాలైన వినేశ్.. కారణం ఇదే!వినేశ్ ఫొగట్‌పై వేటు: ప్రధాని మోదీ స్పందన.. కీలక ఆదేశాలు #WATCH | On Indian wrestler Vinesh Phogat's disqualification from #ParisOlympics2024, her uncle Mahavir Phogat says, "I have nothing to say. The entire country has expected Gold... Rules are there but if a wrestler is 50-100 grams overweight they are usually allowed to play. I… pic.twitter.com/h7vfnJ8ZuH— ANI (@ANI) August 7, 2024#WATCH | #ParisOlympics2024 | Indian wrestler Vinesh Phogat's uncle Mahavir Phogat breaks down after the wrestler gets disqualified.Indian Wrestler Vinesh Phogat disqualified from the Women’s Wrestling 50kg for being overweight. pic.twitter.com/mzDFvMV8oT— ANI (@ANI) August 7, 2024 -
అందుకే మిస్టర్ పర్ఫెక్షనిస్ట్
పికె లాంటి భారీ హిట్ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్, ప్రస్తుతం దంగల్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ప్రజెంట్ బాలీవుడ్లో బయోపిక్ సినిమాల సీజన్ నడుస్తుండటంతో అదే జానర్లో ప్రముఖ రెజ్లర్ మహావీర్ ఫోగట్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మామూలు కథల విషయంలోనే ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ఆమిర్, నిజజీవిత కథ కావటంతో దంగల్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్న ఆమిర్., ఆ లుక్స్ కోసం భారీ కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే వయసయిన రెజ్లర్‌లా కనిపించటం కోసం 22 రెండు కేజీల బరువు పెరిగి షూటింగ్లో పాల్గొన్నాడు. ఈ సన్నివేశాల్లో ఇద్దరు పిల్లలకు తండ్రిగా కనిపించనున్నాడు ఆమిర్. ఇక యంగ్ ఏజ్‌లో ఉన్న మహావీర్ పొగట్టకు సంబందించిన సన్నివేశాల చిత్రీకరణ కోసం తనను తాను ఓ యోధుడిగా మలుచుకుంటున్నాడు. షూటింగ్ కు రెండు రోజుల ముందు తను ఎలా ఉన్నాడో చూపిస్తూ ఓ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు ఆమిర్. కేవలం 25 వారాల్లో 25 కిలోల బరువు తగ్గి కండల తిరిగిన దేహంతో కనిపిస్తున్నాడు. సినిమా కోసం ఇంత రిస్క్ చేస్తున్న ఆమిర్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. 2 days to go before I shoot for young Mahaveer.... @avigowariker pic.twitter.com/RkdmQAV5c0 — Aamir Khan (@aamir_khan) 13 June 2016 -
ఆమిర్.. 25 వారాల్లో 25 కేజీలు..!
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, ప్రస్తుతం తను చేస్తున్న సినిమా కోసం భారీ రిస్క్ చేస్తున్నాడు. మల్లయోధుడు మహావీర్ ఫొగట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న దంగల్ సినిమాలో నటిస్తున్న ఆమిర్, ఆ పాత్ర కోసం భారీగా బరువు పెరిగాడు. ముఖ్యంగా కీలక సన్నివేశాల్లో 55 ఏళ్ల వయసులో ఇద్దరు అమ్మాయిల తండ్రిగా కనిపించనున్న ఆమిర్ ఖాన్. అందుకు తగ్గ ఆహార్యం కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకొని బరువు పెరిగాడు. ఆ భాగం షూటింగ్ పూర్తవ్వటంతో ఆమిర్ ఇప్పుడు బరువు తగ్గే పనిలో ఉన్నాడు. నెక్ట్స్ షెడ్యూల్లో తన వయసుకన్నా మరింత యంగ్‌గా కనిపించటం కోసం ఏకంగా 25 కేజీల బరువు తగ్గటానికి కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే డైట్ మార్చేసి సన్నబడే పనిలో ఉన్న ఆమిర్, ప్రముఖ డైటీషియన్ డాక్టర్ వినోద్ దురందర్ పర్యవేక్షణలో 25 వారాల్లోనే 25 కేజీల బరువు తగ్గాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇంత వేగంగా బరువు పెరగటం, తగ్గటం ఆరోగ్యానికి అంత మంచిది కాదని డాక్టర్లు చెపుతున్నా, క్యారెక్టర్ కోసం ఆమిర్ రిస్క్ చేయడానికే రెడీ అయ్యాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న దంగల్ సినిమాకు నితీష్ తివారీ దర్శకుడు. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్, డిస్నీ వరల్డ్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సాక్షి తన్వార్ హీరోయిన్గా నటిస్తోంది. క్రిస్టమన్ కానుకగా 2016 డిసెంబర్ 23న దంగల్ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.