అబ్దుల్ కలామ్‌గా అమితాబ్? | amitabh bachan act to abdul kalam role | Sakshi
Sakshi News home page

అబ్దుల్ కలామ్‌గా అమితాబ్?

Published Wed, Aug 5 2015 12:18 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

అబ్దుల్ కలామ్‌గా అమితాబ్? - Sakshi

అబ్దుల్ కలామ్‌గా అమితాబ్?

క్షిపణి పితామహుడు, రాష్ట్రపతిగా భారత దేశ  ప్రజానీకం గుండెల్లో చెరగని ముద్రవేసిన డాక్టర్ అబ్దుల్ కలామ్ జీవితం ఆధారంగా ఓ సినిమా రానుంది. టైటిల్ రోల్‌లో బాలీవుడ్ ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్ కనిపిస్తారని సమాచారం. ‘అయామ్ కలామ్’ అనే లఘు చిత్రంతో జాతీయ అవార్డు సాధించిన దర్శకుడు నిలా మధాబ్ పాండే ఈ చిత్రాన్ని రూపొందించే సన్నా హాల్లో ఉన్నారు.
 
  ‘‘కలామ్ లాంటి మహనీయుడి జీవితం ఆధారంగా సినిమా తీయాలంటే ఎంతో అధ్యయనం చేయాలి. కలామ్ పాత్రకు అమితాబ్ బచ్చన్ తప్ప ఎవరూ సెట్ కారని నా నమ్మకం’’ అని పాండే చెబుతున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు బయటకొస్తాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement