కోలీవుడ్‌కు బిగ్‌బీ? | Amitabh Bachan approached for a role in S J Surya next new movie | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌కు బిగ్‌బీ?

Published Fri, Dec 30 2016 2:10 AM | Last Updated on Mon, May 28 2018 3:50 PM

కోలీవుడ్‌కు బిగ్‌బీ? - Sakshi

కోలీవుడ్‌కు బిగ్‌బీ?

సినిమా అభిమానులందరూ అభిమానంగా బిగ్‌బీ అని పిలుచుకునే ది గ్రేట్‌ బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌బచ్చన్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటించిన హిందీ చిత్రాలు తమిళనాట విశేష ప్రేక్షకాదరణ పొందాయి. కానీ అమితాబ్‌ ఇప్పటి వరకూ తమిళ చిత్రంలో నటించలేదు. అయితే తమిళ చిత్రాల్లో నటించాలన్న ఆసక్తిని మాత్రం బిగ్‌బీ చాలా సార్లు వ్యక్తం చేశారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు అమితాబ్‌కు మధ్య స్నేహసంబంధం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి పలు హిందీ చిత్రాల్లో నటించారు. ఇటీవల తమిళంలో రజనీకాంత్‌ నటించే చిత్రంలో చిన్న పాత్ర అయినా పోషించడానికి తాను రెడీ అని బిగ్‌బీ పేర్కొన్నారు. అలాంటి అమితాబ్‌కు ఇప్పుడు కోలీవుడ్‌ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది.

ఇంతకు ముందు కల్వనిన్‌ కాదలి, మచ్చక్కారన్, నంది చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు తమిళ్‌వానన్‌ తాజాగా ఎస్‌జే.సూర్య హీరోగా ఉయిర్నిద మనిదన్‌ అనే చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధం అవుతున్నారు. ఇదే టైటిల్‌తో గతంలో శివాజీగణేశన్‌ హీరోగా ఏవీఎం సంస్థ చిత్రాన్ని నిర్మించింది. ఇప్పుడా సంస్థ నుంచి ఆ టైటిల్‌ పొంది ఎస్‌జే.సూర్య కథానాయకుడిగా చిత్రం చేయనున్నట్లు ఆ చిత్ర వర్గాలంటున్నాయి. ఇందులో ఒక ప్రధాన పాత్రలో అమితాబ్‌బచ్చన్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. దర్శకుడు చెప్పిన కథ విన్న బిగ్‌బీ ఈ స్క్రి ప్ట్‌ను హింది, ఇంగ్లిష్‌ భాషల్లో తనకు ఇవ్వవలసిందిగా కోరినట్లు యూనిట్‌ వర్గాల సమాచారం.అయితే ఈ చిత్రం ద్వారా బిగ్‌బీ కోలీవుడ్‌కు వస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement