
ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్‌ల ఆరోగ‍్యం స్థిమితంగా ఉందని ముంబై నానావతి హాస్పిటల్ వైద్యులు సోమవారం వెల్లడించారు. బిగ్‌బి, అభిషేక్‌లకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరిన వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, వారికి పెద్దగా కరోనా చికిత్స అందించాల్సిన అవసరం లేదని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. (చదవండి: కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై అభిషేక్ ట్వీట్)
తనకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్లు బిగ్‌బీ శనివారం(జులై 11) సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆ తర్వాత అదే రోజు రాత్రి ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా తనకు కోరోనా పాజిటివ్ వచ్చినట్లు ట్వీట్ చేస్తూ..‘నాకు, నా తండ్రి అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. మాకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చేరాము’ అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆదివారం అభిషేక్ మరో ట్వీట్ చేస్తూ తన భార్య ఐశ్వర్య రాయ్ బచ్చన్, కూతురు ఆరాధ్య బచ్చన్‌లకు కూడా పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించాడు. (చదవండి: అమితాబ్‌కు కరోనా.. ఉలిక్కిపడ్డ బాలీవుడ్)
Comments
Please login to add a commentAdd a comment