సైరాకు బిగ్‌ షాక్‌..? | Amitabh bachchan out Of Sye raa | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 28 2018 11:46 AM | Last Updated on Sun, Jan 28 2018 4:28 PM

Sye raa Narasimha reddy - Sakshi

‘సై రా నరసింహారెడ్డి’ ప్రచార చిత్రం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ హిస్టారికల్‌ డ్రామా ‘సైరా నరసింహారెడ్డి’. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్‌ స్టార్ రామ్‌చరణ్‌ భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే తొలి షెడ్యూల్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమాకు సంబంధించిన రకరకాల వార్తలు అభిమానులకు షాక్‌ ఇస్తున్నాయి.

ఇప్పటికే సంగీత దర్శకుడిగా ప్రకటించిన ఏ ఆర్‌ రెహమాన్ ఈ సినిమాకు పనిచేయటం లేదని ప్రకటించారు. సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్‌ కూడా తప్పుకున్నట్టుగా వార్తలు వినిపించాయి. తాజాగా సినిమాలో కీలక పాత్రలో నటించనున్న బాలీవుడ్ బిగ్‌ బి అమితాబ్‌ కూడా సైరా టీంకు షాక్ ఇచ్చారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ మాత్రం ఇంత వరకుస్పందించలేదు. ఫిబ్రవరి సైరా రెండో షెడ్యూల్‌ షూటింగ్ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement