ఇదో అరుదైన కాంబినేషన్! | Amitabh Bachchan shoots with Prabhu Ganeshan, Nagarjuna | Sakshi
Sakshi News home page

ఇదో అరుదైన కాంబినేషన్!

Published Thu, Mar 12 2015 10:43 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

ఇదో అరుదైన కాంబినేషన్! - Sakshi

ఇదో అరుదైన కాంబినేషన్!

 తెలుగులో నాగార్జున పాపులర్ స్టార్. తమిళంలో ప్రభు కూడా అంతే. ఆయన తనయుడు విక్రమ్ ప్రభు ఇప్పుడిప్పుడే హీరోగా పైకొస్తున్నాడు. కన్నడ రంగంలో హీరో శివరాజ్‌కుమార్‌కి తిరుగులేదు. దక్షిణాదికి చెందిన ఈ స్టార్స్ అందరూ ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్‌ని ఎందుకు కలిసినట్లు? అది కూడా ఈ ఐదుగురూ ఇలా పట్టు పంచెలు కట్టుకుని ఎక్కడికెళ్లారు? వంటి ప్రశ్నలు మీ మనసుని తొలిచేస్తున్నాయి కదూ..? మరేం లేదు. ఈ ఐదుగురూ కలిసి ఓ వాణిజ్య ప్రకటనలో నటించారు. ఆ సందర్భంగా క్లిక్‌మనిపించిన ఈ ఫొటోను అమితాబ్ బచ్చన్, విక్రమ్ ప్రభు తమ ట్విట్టర్లో పెట్టారు. దక్షిణాది స్టార్స్ నాగార్జున, ప్రభు, శివరాజ్‌కుమార్లతో నటించడం మంచి అనుభూతినిచ్చిందనీ, ఈ ముగ్గురి తండ్రులూ తనకు సీనియర్లనీ, వాళ్లు గొప్పవాళ్లనీ ఈ సందర్భంగా అమితాబ్ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement