మళ్లీ ఆ మేజిక్ రిపీట్ అవుతుందా? | Amitabh Bachchan, Sridevi in Balki's next? | Sakshi
Sakshi News home page

మళ్లీ ఆ మేజిక్ రిపీట్ అవుతుందా?

Published Sun, Jul 12 2015 11:15 PM | Last Updated on Sun, Sep 3 2017 5:23 AM

మళ్లీ ఆ మేజిక్ రిపీట్ అవుతుందా?

మళ్లీ ఆ మేజిక్ రిపీట్ అవుతుందా?

అమితాబ్ బచ్చన్, శ్రీదేవిల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుంది. అందుకు నిదర్శనం ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘ఇంక్విలాబ్’, ‘ఆఖరీ రాస్తా’, ‘ఖుదాగ వా’. ఆ తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ జంటగా నటించలేదు. కానీ, సెకండ్ ఇన్నింగ్స్‌లో శ్రీదేవి చేసిన తొలి చిత్రం ‘ఇంగ్లిష్ వింగ్లిష్’లో అమితాబ్ అతిథి పాత్ర చేశారు. ఒకప్పుడు హిట్ పెయిర్ అయిన ఈ ఇద్దరూ మళ్లీ జతకట్టనున్నారని సమాచారం. అమితాబ్‌తో ‘చీనీ కమ్’, ‘పా’, ‘షమితాబ్’ లాంటి విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన బాల్కీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని భోగట్టా.
 
 శ్రీదేవి నటించిన ‘ఇంగ్లిష్ వింగ్లిష్’కి బాల్కీ భార్య గౌరీ షిండే దర్శకత్వం వహించారు. కాగా, ఇటీవల శ్రీదేవిని బాల్కీ కలిశారట. ఈ చిత్రంలో నటించడానికి ఆమె సుముఖంగానే ఉన్నారని సమాచారం. బాల్కీతో ఇప్పటికే మూడు వైవిధ్యభరిత చిత్రాల్లో చేసిన అనుభవం ఉంది కాబట్టి, అమితాబ్ కూడా ఇందులో నటించడానికి సిద్ధమయ్యారట. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారట. అమితాబ్, శ్రీదేవి ఇప్పుడు వయసు మీద పడ్డ జంటగా మునుపటి మేజిక్‌ని రిపీట్ చేస్తారా?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement