‘ఆచార్య’లో అనసూయ.. చరణ్‌తో? | Anasuya Special Song In Chiranjeevis Acharya Telugu Movie | Sakshi
Sakshi News home page

చిరుతో రెజీనా.. చరణ్‌తో అనసూయా?

Published Tue, May 5 2020 11:42 AM | Last Updated on Tue, May 5 2020 12:18 PM

Anasuya Special Song In Chiranjeevis Acharya Telugu Movie - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ దాదాపు సగానికిపైగా పూర్తయింది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఈ చిత్ర షూటింగ్‌ వాయిదా పడినా ‘ఆచార్య’కు సంబంధించిన వార్తలను లీకువీరులు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి-రెజీనాల మధ్య వచ్చే స్పెషల్‌ సాంగ్‌ అదిరిపోతుందని, ఈ పాటకు చిరు స్టెప్పులు మాములుగా ఉండవని అంటున్నారు. 

ఇక ఈ సినిమాలో రామ్‌చరణ్‌ ఓ కీలక పాత్ర పోషించనున్నాడు. అయితే చరణ్‌ ఎపిసోడ్‌లో కూడా ఓ స్పెషల్‌ సాంగ్‌కు డైరెక్టర్‌ ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ స్పెషల్‌ సాంగ్‌లో చరణ్‌తో అనసూయ ఆడిపాడనుందని టాలీవుడ్‌ టాక్‌. రంగస్థలంలో చరణ్‌, అనసూయల మధ్య వచ్చే సీన్స్‌ ఎంత హైలెట్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘ఆచార్య’లో కూడా వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్‌ మామూలుగా ఉండవని లీకువీరులు అంటున్నారు. అంతేకాకుండా ఈ చిత్రంలో మెగా డాటర్‌ నిహారిక ఓ చిన్నిపాటి పాత్రలో మెరవనుందని సమాచారం. మ్యాటినీ ఎంటర్‌ టైన్‌మెంట్‌, కొనిదల ప్రొడక్షన్‌ బ్యానర్స్‌పై రామ్‌ చరణ్‌, నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. 

చదవండి:
రూట్‌ మార్చిన ‘కుమారి’
‘మీరెవరు నన్ను అడగడానికి.. అది నా ఇష్టం’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement