మేనత్త పాత్రలో అనసూయ..! | Anchor Anasuya Character in Rangasthalam | Sakshi
Sakshi News home page

Jan 2 2018 2:03 PM | Updated on Jan 2 2018 2:10 PM

Anchor Anasuya Character in Rangasthalam - Sakshi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి కేవలం ఒక్క ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మాత్రమే రిలీజ్ చేశారు చిత్రయూనిట్. పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమా లోకేషన్ స్టిల్స్ ను రిలీజ్ చేస్తూ హడావిడి చేస్తున్నారు చిత్రయూనిట్.

భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటించనుంది. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమాలో అనసూయ రామ్ చరణ్ కు మేనత్తగా నటిస్తోందట. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, ఆది పినిశెట్టి, రావు రమేష్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement