
ఎన్టీఆర్, పూజా హెగ్డే
‘అనగనగా అరవిందట తన పేరు.. అందానికి సొంతూరు.. అందుకనే అంత పొగరు’ అంటూ సాగే ఫాస్ట్ బీట్ సాంగ్‌ను శనివారం రిలీజ్ చేసింది ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రబృందం. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై యస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమాలోని ఓ సాంగ్ లిరికల్ వీడియోను శనివారం రిలీజ్ చేశారు. కేవలం సాంగ్‌ను మాత్రమే కాకుండా పాట స్టార్ట్ అయ్యే లీడ్ సన్నివేశంలోని చిన్న బిట్‌ని కూడా జోడించారు.
‘చూడటానికి టఫ్‌గా కనిపిస్తావు కానీ... చెప్పిన మాట వింటావు’ అని ప్రేయసి పూజా హెగ్డే పొగడగా ఎన్టీఆర్ సిగ్గుపడుతుంటే పాట మొదలవుతుందని ఈ బిట్ స్పష్టం చేసింది. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రచించిన ఈ పాటకు తమన్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. పాటల షూటింగ్ మినహా టాకీ పార్ట్ కంప్లీట్ అయిందని సమాచార ం. ఈ సినిమాలో ఫస్ట్ టైమ్ పూజా హెగ్డే తన పాత్రకు సొంత డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. మరోపక్క శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ చేస్తున్నారు చిత్రబృందం.
∙
Comments
Please login to add a commentAdd a comment