పనికి మాలినోళ్లతో బిగ్‌ బాస్‌ | arshad warsi Comments on Bigg Boss 11 | Sakshi
Sakshi News home page

బిగ్‌ బాస్‌ పై అర్షద్ వార్సి వ్యాఖ్యలు

Published Tue, Oct 17 2017 1:08 PM | Last Updated on Thu, Jul 18 2019 1:55 PM

arshad warsi Comments on Bigg Boss 11 - Sakshi

సాక్షి, సినిమా : బాలీవుడ్ నటుడు అర్షద్‌ వార్సి బిగ్ బాస్‌ షోపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా నడుస్తున్న ప్రస్తుత సీజన్‌ చాలా చాలా పేలవంగా ఉందని వార్సి చెబుతున్నాడు. కేవలం వివాదాల ద్వారా టీఆర్పీ పెంచుకునేందుకు వాళ్లు(ఛానెల్‌ నిర్వాహకులు) యత్నిస్తున్నారు అంటూ ఈ విలక్షణ నటుడు వ్యాఖ్యానించాడు. 

ప్రస్తుతం 11వ సీజన్‌ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మొన్నీమధ్యే జుబైర్‌ ఖాన్‌ వ్యవహారం సంచలనంగా మారింది. సల్మాన్‌ తిట్టడంతో.. కలత చెందిన జుబైర్‌ ఆత్మహత్యకు యత్నించటం.. ఆ తర్వాత సల్మాన్‌పై కేసు పెట్టడం విదితమే. అయితే ఇలా వివాదాలతో షోను నడిపించటం మంచిది కాదని అర్షద్‌ సలహ ఇస్తున్నాడు. ‘‘నేనేం షోను చూడట్లేదు. కానీ, నేను విన్నదాన్ని బట్టి ఇందులో అంతా పనికి మాలిన వాళ్లే ఉన్నారనుకుంటున్నా. ప్రజలకు వినోదం పంచటం అంటే వ్యాపారం కాదు. ఇలాంటివి ఛానెళ్లు మానుకుంటే మంచిది’’ అని అర్షద్ చెబుతున్నారు.

మరోవైపు టీఆర్పీ కూడా దారుణంగా పడిపోవటం ఛానెల్‌ నిర్వాహకులను కలవరపెడుతోంది. అయితే రానున్న రోజుల్లో పుంజుకునే అవకాశం ఉందని వాళ్లు భావిస్తున్నారు. 2006లో ప్రారంభమైన బిగ్ బాస్‌ షో మొదటి సీజన్‌కు అర్షద్‌ వార్సి హోస్ట్‌ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. త్వరలో గోల్‌ మాల్‌ అగెయిన్‌ చిత్రంతో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement