'నాలోని నటుణ్ని గుర్తించింది అతనే' | Arshad Warsi was the first person to see the actor in me | Sakshi
Sakshi News home page

'నాలోని నటుణ్ని గుర్తించింది అతనే'

Published Thu, Aug 4 2016 2:37 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

'నాలోని నటుణ్ని గుర్తించింది అతనే'

'నాలోని నటుణ్ని గుర్తించింది అతనే'

విలక్షణ పాత్రలతో సౌత్ నార్త్ ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు బొమన్ ఇరానీ. మున్నాభాయ్ ఎంబిబియస్ సినిమాతో బాలీవుడ్కు పరిచయం అయిన బొమన్ ప్రస్తుతం 'ద లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా' సినిమాలో నటించాడు.  ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా తన తెరంగేట్రానికి సంబందించిన విశేషాలను తెలియజేశాడు.

సినిమాల్లోకి రాకముందు థియేటర్ ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్న బొమన్ తొలిసారిగా బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ కొరియోగ్రాఫ్ చేసిన నాటకంలో నటించాడు.  ఆ తరువాత అర్షద్ ప్రోత్సాహంతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బోమన్ ఇప్పటి వరకు నాలుగు సినిమాల్లో అర్షద్తో కలిసి నటించాడు.

ప్రస్తుతం ఐదోసారి ఈ జోడి 'ద లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా' సినిమాతో నవ్వులు పూయించేందుకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా తనలోని నటుణ్ని గుర్తించిన అర్షద్కు కృతజ్ఞతలు తెలియజేసిన బొమన్ ఇరానీ.. మరోసారి అతనితో కలిసి నటిచటం ఆనందంగా ఉందని తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement