The Legend Of Michael Mishra
-
'నాలోని నటుణ్ని గుర్తించింది అతనే'
విలక్షణ పాత్రలతో సౌత్ నార్త్ ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు బొమన్ ఇరానీ. మున్నాభాయ్ ఎంబిబియస్ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయిన బొమన్ ప్రస్తుతం 'ద లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా' సినిమాలో నటించాడు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా తన తెరంగేట్రానికి సంబందించిన విశేషాలను తెలియజేశాడు. సినిమాల్లోకి రాకముందు థియేటర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న బొమన్ తొలిసారిగా బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ కొరియోగ్రాఫ్ చేసిన నాటకంలో నటించాడు. ఆ తరువాత అర్షద్ ప్రోత్సాహంతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బోమన్ ఇప్పటి వరకు నాలుగు సినిమాల్లో అర్షద్‌తో కలిసి నటించాడు. ప్రస్తుతం ఐదోసారి ఈ జోడి 'ద లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా' సినిమాతో నవ్వులు పూయించేందుకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా తనలోని నటుణ్ని గుర్తించిన అర్షద్‌కు కృతజ్ఞతలు తెలియజేసిన బొమన్ ఇరానీ.. మరోసారి అతనితో కలిసి నటిచటం ఆనందంగా ఉందని తెలిపాడు. -
'ఐటమ్ నంబర్ అని పిలవకండి'
సినిమాల్లో డ్యాన్సులను 'ఐటమ్ నంబర్' అని పిలవకండి అంటూ మండిపడుతోంది అందాలతార అదితి రావ్. 'ది లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా' లో తను చేస్తున్న పాట గురించి విలేకరులు ప్రశ్నించగా అమ్మడు అంతెత్తున విరుచుకుపడింది. 'నేను దాన్ని ఐటమ్ నెంబర్ అని అనుకోను. అయినా 2016లో కూడా ఎవరైనా అలా అంటారని నేననుకోను. ఇంకా ప్రత్యేక డ్యాన్సులను ఐటమ్ నంబర్ అని అంటున్నారంటే అది నిజంగా బాధాకరం. ఐటమ్ సాంగ్ అంటున్నారంటే ఆ పాటలో డ్యాన్స్ చేసే అమ్మాయిని ఐటమ్ గా వర్ణిస్తున్నట్టేగా' అంటూ ప్రశ్నించింది. ఇంకా ఆమె మాట్లాడుతూ.. మాధురీ దీక్షిత్ డ్యాన్స్ చేస్తే ఆమెను డ్యాన్సర్ అని అనాలి గానీ, ఐటమ్ అని అనరు కదా. ఏదైనా మన ఆలోచనా విధానం మీద ఆధారపడి ఉంటుందంటూ చురకలంటించింది. రెండేళ్ల క్రితమే రిలీజ్ అవ్వాల్సిన 'ది లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా' ఎట్టకేలకు వచ్చేవారం విడుదలకు సిద్ధమైంది. సినిమా అందరికీ నచ్చుతుందంటూ అదితి ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా ఆమె మణిరత్నం తదుపరి చిత్రం ‘కాట్రు వెళియిడై’లో కార్తీ సరసన నటిస్తోంది. -
బాలీవుడ్లో ‘ఆట’ ఎలా ఆడాలో తెలియలేదు
హిందీ సినీ పరిశ్రమలో తాను అడుగుపెట్టినప్పుడు ఇక్కడ ‘ఆట’ ఎలా ఆడాలో (అవకాశాలను సంపాదించుకోవడం) తెలియలేదని, ఇప్పుడు పట్టు దొరికినందుకు సంతోషంగా ఉంది అని అంటోంది అదితిరావు హైదరి. తన స్థానాన్ని ఇకపై ఎవరూ భర్తీ చేయలేని విధంగా ఎదగటమే తన లక్ష్యమని చెప్పుకుంది. ‘‘ఇప్పుడు ఒక్కొక్కటి అన్నీ కుదురుకుంటున్నాయి. నాకూ ఓ స్థానం లభించింది. సాటిలేని స్థానాన్ని సంపాదించడమే నా లక్ష్యం. ఏది నాదో... అది నాకే చెందాలి’’ అని కాస్త అత్యుత్సాహం ప్రకటించింది. ‘గుడ్డూ రంగీలా’, ‘ది లెజెండ్ఆఫ్ మైఖేల్ మిశ్రా’ చిత్రాల్లో అదితి విభిన్నమైన పాత్రలను పోషిస్తోంది. 2006లోనే బాలీవుడ్లో కాలుమోపినప్పటికీ ఆమెకు సరైన గుర్తింపు లభించలేదు. ‘యే సాలీ జిందగీ’, ‘ఢిల్లీ-6’ సినిమాల్లో కనిపించిన అదితి బాలీవుడ్లో బయటి వ్యక్తిగా ఉండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. మన ప్రవర్తన, ఉద్దేశ్యాలను బట్టే వ్యవహారం నడుస్తుందని అభిప్రాయపడింది. ఒంటిరిదానవై ఆకర్షణీయంగా ఉంటే మగవాళ్లు అదోరకంగా చూస్తారని చెప్పింది. భార్యలు, ప్రియురాళ్లు చూడనప్పుడు చాలా మంది పురుషులు వింతగా ప్రవర్తిస్తారన్నది తన నమ్మకం చెప్పింది. ఇంతవరకు బాలీవుడ్ తోడేళ్ల బారిన పడకపోవటం తన అదృష్టమని తెలిపింది.