బాలీవుడ్‌లో ‘ఆట’ ఎలా ఆడాలో తెలియలేదు | I didn't know how to play the game in Bollywood: Aditi Rao Hydari | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌లో ‘ఆట’ ఎలా ఆడాలో తెలియలేదు

Published Thu, Jun 26 2014 11:00 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

బాలీవుడ్‌లో ‘ఆట’ ఎలా ఆడాలో తెలియలేదు - Sakshi

బాలీవుడ్‌లో ‘ఆట’ ఎలా ఆడాలో తెలియలేదు

 హిందీ సినీ పరిశ్రమలో తాను అడుగుపెట్టినప్పుడు ఇక్కడ ‘ఆట’ ఎలా ఆడాలో (అవకాశాలను సంపాదించుకోవడం) తెలియలేదని, ఇప్పుడు పట్టు దొరికినందుకు సంతోషంగా ఉంది అని అంటోంది అదితిరావు హైదరి. తన స్థానాన్ని ఇకపై ఎవరూ భర్తీ చేయలేని విధంగా ఎదగటమే తన లక్ష్యమని చెప్పుకుంది. ‘‘ఇప్పుడు ఒక్కొక్కటి అన్నీ కుదురుకుంటున్నాయి. నాకూ ఓ స్థానం లభించింది. సాటిలేని స్థానాన్ని సంపాదించడమే నా లక్ష్యం. ఏది నాదో... అది నాకే చెందాలి’’ అని కాస్త అత్యుత్సాహం ప్రకటించింది. ‘గుడ్డూ రంగీలా’, ‘ది లెజెండ్‌ఆఫ్ మైఖేల్ మిశ్రా’ చిత్రాల్లో అదితి విభిన్నమైన పాత్రలను పోషిస్తోంది.
 
 2006లోనే బాలీవుడ్‌లో కాలుమోపినప్పటికీ ఆమెకు సరైన గుర్తింపు లభించలేదు. ‘యే సాలీ జిందగీ’, ‘ఢిల్లీ-6’ సినిమాల్లో కనిపించిన అదితి బాలీవుడ్‌లో బయటి వ్యక్తిగా ఉండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. మన ప్రవర్తన, ఉద్దేశ్యాలను బట్టే వ్యవహారం నడుస్తుందని అభిప్రాయపడింది. ఒంటిరిదానవై ఆకర్షణీయంగా ఉంటే మగవాళ్లు అదోరకంగా చూస్తారని చెప్పింది. భార్యలు, ప్రియురాళ్లు చూడనప్పుడు చాలా మంది పురుషులు వింతగా ప్రవర్తిస్తారన్నది తన నమ్మకం చెప్పింది. ఇంతవరకు బాలీవుడ్ తోడేళ్ల బారిన పడకపోవటం తన అదృష్టమని తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement