హీరోయిన్‌కు షాకిచ్చిన ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌! | Aditi Rao Hydari car violates traffic rules, driver paper seized | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌కు షాకిచ్చిన ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌!

Published Tue, May 17 2016 6:18 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

హీరోయిన్‌కు షాకిచ్చిన ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌! - Sakshi

హీరోయిన్‌కు షాకిచ్చిన ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌!

బాలీవుడ్ హీరోయిన్‌ ఆదితి రావు హైదరికి నోయిడాలో ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ చుక్కలు చూపెట్టారు. ఆమె కారు రాంగ్‌ రూట్‌లో వెళుతుండగా అడ్డుకొని.. కారు డ్రైవర్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. శనివారం నోయిడాలో ఈ ఘటన జరిగింది. శనివారం ఓ ఈవెంట్‌లో పాల్గొనడానికి ఆదితి కారులో బయలుదేరింది. నోయిడాలోని సెక్టర్-18, సెంటర్ స్టేజ్‌ మాల్‌ వద్ద రాంగ్‌ టర్న్‌ తీసుకొని ఆమె కారు ముందుకువెళ్లింది. మాల్ వద్దకు షార్ట్‌కట్‌లో వెళ్లేందుకు ప్రయత్నించగా.. కారును నోయిడా సెక్టర్‌-18 ట్రాఫిక్ కానిస్టేబుల్ ధర్మేంద్ర యాదవ్ అడ్డుకున్నారు.

'ఆదితి రావు కారు నేరుగా ముందుకెళ్లాల్సి ఉండగా, షార్ట్‌కట్‌ కోసం రాంగ్‌ టర్న్‌ తీసుకుంది. దీంతో కారును నేను ఆపి.. లైసెన్స్‌ చూపాల్సింది డ్రైవర్‌ను అడిగాను. అప్పుడు మరో కారులోంచి దిగిన వ్యక్తి 'సెలబ్రిటీ కదా.. వదిలేయండి. రూ. 10 వేలో, 20 వేలో తీసుకొని ఈ వ్యవహారాన్ని ముగించండ'ని చెప్పాడు. అయితే, నేను మాత్రం రూ. పదివేలు ఎందుకు? నేను జరిమానా రాస్తాను. కేవలం రూ. 700లే అవుతుంది. ఎందుకు ఎక్కువ తీసుకుంటాన'ని చెప్పాను' అని ఇన్‌స్పెక్టర్‌ ధర్మేంద్ర యాదవ్ మీడియాకు తెలిపారు. ఈలోపు ఆదితి రావు తన కారు దిగి మాల్‌లోకి వెళ్లిందని, దీంతో కారు డ్రైవర్ లైసెన్స్‌ను స్వాధీనం చేసుకున్నానని, ఆమె సెలబ్రిటీ అనే విషయం నాకు తెలియదని యాదవ్ స్పష్టం చేశారు. ఆదితి రావు తాజాగా ఫర్హాన్ అఖ్తర్‌, అమితాబ్ బచ్చన్ నటించిన 'వజీర్‌' సినిమాలో హీరోయిన్‌గా కనిపించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement